Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: సినీ పెద్దలకు సీఎం సీరియస్ వార్నింగ్, ఏమన్నారంటే..?

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు అంతరం పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి తో సినీ ప్రముఖుల భేటీ ప్రాధాన్యతను సంతరించు కుంది. అనుకున్న సమయానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి  కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోగా సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరుకున్నారు. దిల్‌రాజ్‌ నేతృత్వంలో 36 మంది సభ్యులు సీఎంతో ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. ఇందులో 21 మంది నిర్మాతలు కాగా 13 మంది దర్శకు లు, 11 మంది నటులు ఉన్నారు.
ఈ భేటీలో పలువురు సినీ ప్రము ఖులు మాట్లాడారు. రాఘవేంద్ర రావు తొలుత మాట్లాడుతూ అందరు ముఖ్యమంత్రులు సినిమా పరిశ్రమను బాగానే చూసుకున్నా రని అన్నారు.

అలాగే ఈ ప్రభు త్వం కూడా మమ్మల్ని బాగా చూ సుకుంటోందని, దిల్‌ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగ తిస్తున్నామన్నారు. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌లు ఉన్నాయని రాఘవేంద్రరావు గుర్తు చేశారు. అదే విధంగా గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో నిర్వహించారని, ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నామని కోరారు. ఆ తరువాత నాగార్జున మాట్లాడుతూ యూనివర్సల్‌ లెవె ల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలని, ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక అని నాగార్జున చెప్పుకొ చ్చారు.

ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పి న మాటకు కట్టుబడి ఉన్నామన్నా మని కొద్దిగా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అలాగే మురళీ మోహన్ మాట్లాడుతూ ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందని, సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందని, సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీల కంగా మారిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్‌ ఉండడం వల్ల ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తు న్నామన్నారు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడు తూ ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నారు.

హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌ చేయాలనేది డ్రీమ్ అని, ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో చెన్నై నుం చి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చిం దని చెప్పారు. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబా ద్‌ కేరాఫ్‌గా ఉండాలని సురేష్‌బా బు తెలిపారు. త్రివిక్రమ్ మాట్లాడు తూ మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చిందని అన్నారు. ఇక ప్రభుత్వం అధికారి కంగా టాలీవు డ్‌కి పూర్తి మద్దతు గా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సంధ్య థియే టర్‌ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసు కుందని సినీ పెద్దలకు వివరించారు.

శాంతి భద్రతల విషయంలో రాజీలేదు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రత ల విషయంలో రాజీ లేదని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని , అడ్డగోలుగా బౌన్సర్ల వినియోగంలో లోతుగా ఆలోచి స్తామని చెప్పారు.అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రైజిం గ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌ బిలిటీతో ఉండాలని సూచించారు. డ్రగ్స్‌ క్యాంపెయిన్‌, మహిళా భద్ర త క్యాంపెయిన్‌లో చొరవ చూపా లన్నారు. టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని కోరారు. ఇన్వెస్ట్‌మెంట్ల విషయం లోనూ ఇండస్ట్రీ సహకరించాల న్నారు.

CM Revanth Reddy