Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Devara: దేవరని వర చంపడానికి కారణం ఇదేనట..!

Devara: తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ntr) నటించిన ‘దేవర’ (Devara)సినిమాకి థియేటర్స్ లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది సంగతి అందరికి విదితమే. రిలీజ్ అయినా రెండో వారంలో కూడా సక్సెస్ ఫుల్ గా ముందుకు కొనసాగుతోంది. సెకండ్ వీకెండ్ కూడా సినిమాకి మంచి వసూళ్లు వచ్చినట్లు టాక్ వస్తుంది. ఈ క్రమంలో దసరా హాలిడేస్ కలిసి రావడంతో మరల థియేటర్స్ ఫుల్ ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. అయితే తాజాగా ‘దేవర’ (Devara)మూవీ విజయం అనంతరం మరల ఎన్టీఆర్, కొరటాల శివ ప్రత్యేకంగా సుమకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇందులో భాగంగా ‘దేవర’ (Devara) మూవీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి అనేక విషయాలు ఎన్టీఆర్, కొరటాల శివ షేర్ చేసుకున్నాటు తెలుస్తోంది. ఈ తరుణంలో పార్ట్ 2 గురించి ఇంటరెస్టింగ్ విషయాలను వారు తెలిపారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ సుమ ‘దేవర 1’ చూసిన తర్వాత ఆడియన్స్ కి వచ్చిన డౌట్స్ ని ఎన్టీఆర్, కొరటాల శివని (NTR, Koratala Shiva) అడిగి తెలుసుకున్నారు. అందుకు ఎన్టీఆర్ వెరైటీగా సమాదాలు చెప్పడం అందరిని అక్కటు కుంటుంది. అసలు దేవరని వర ఎందుకు చంపాడు? అని సుమ ప్రశ్నించింది. చెప్పేస్తారు మరి… ఆ సీక్రెట్ చెప్పేస్తే ‘దేవర 2’ కి ఎవరు టికెట్లు కొంటారు? అని సరదాగా కౌంటర్ వేశారు ఎన్టీఆర్.

అలాగే సముద్రంలో అస్థిపంజరాలు ఎవరివి అంటూ సుమ (suma)మరో ప్రశ్న వేసింది. ఆ ఆస్థిపంజరాలు అన్ని ఈదుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోయాయి అంటూ ఎన్టీఆర్ ఫన్నీగా సమాధానం ఇచ్చారు. అయితే కొరటాల శివ వాటిపై ఓ చిన్న క్లూ ఇచ్చారు. ఆ ఆస్థి పంజరాల్లో ఒకటి మాత్రం చాలా ముఖ్యమైన క్యారెక్టర్ ది. ఆ క్యారెక్టర్ ఎవరనేది తెలియాలంటే ‘దేవర 2’ చూడాలి అంటూ సమాధానం చెప్పారు. వారి సంభాషణ బట్టి దేవర మూవీ ఆరంభంలో సముద్రం లోపల చూపించిన ఆస్థిపంజరాల బ్యాక్ డ్రాప్ లో అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని స్పష్టం తెలిసిపోతుంది.

అలాగే ఈ క్రమంలో ‘దేవర పార్ట్ 2’ లో మెయిన్ రోల్ కి (main role)సంబందించిన ఒక ఎమోషనల్ సీన్ ఉంటుందని ఎన్టీఆర్ తెలిపారు. అది ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందని అయినా అన్నారు. చాలా ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ సెకండ్ పార్ట్ లో ఎంగేజింగ్ గా ఉండబోతున్నాయని ఎన్టీఆర్, కొరటాల శివ ఇంటర్వ్యూలో తెలిపినట్టు సమాచారం. చూడాలి మరి ఇంకా ఎన్ని రోజుల అనంతరం ‘దేవర పార్ట్ 2’ సినిమా ప్రేక్షకుల ముందు వస్తుదని.