Diwali Movie Release: దసరా (dasara)కానుకగా విడుదలయ్యే సినిమాల క్రేజ్ దాదాపుగా ముగిసింది. సోమవారం టిక్కెట్లు అమ్ముడయ్యాయి. రాబోయే పని దినాలలో ఇది జరగకపోవచ్చు. ఇక ఇప్పుడు అందరి దృష్టి వచ్చే దీపావళిపైనే ఉంది. పండగ రిలీజ్ సెలబ్రేషన్ కాబట్టి ఈరోజు అరడజను సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని సినిమాలు దీపావళి రేసులోకి (Diwali race) ప్రవేశించగా మరికొన్ని డ్రాప్ అయ్యినట్టు తెలుసోతోంది .
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన లక్కీ భాస్కర్ సినిమా షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగా అక్టోబర్ 30న థియేటర్లలోకి సందడి చేయబోతుంది . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుందని ఫాన్స్ భావిస్తున్నారు. అప్పుడో ఇపుడో ఎపుడో ప్రధాన పాత్రలో నిఖిల్ తెరకెక్కించిన సీమ టపాకాయ్ సినిమా అక్టోబర్ 31న రెడీ అవగా, అదే రోజు సత్యదేవ్ తారాజువ్వ స్టైల్ సినిమా జీబ్రా ఎఫైర్స్ రిలీజ్ కానున్నాయి. అది చాలదన్నట్లు చిచ్చుబుడ్డి లాంటి తమిళ హీరో శివ కార్తికేయన్ (Karthikeyan) నటించిన అమరన్ కూడా రేసులో ఉన్నాడు. భూచక్రం జయం రవి నటించిన బ్రదర్ వంటి డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. మరి దీపావళి సందడిలో ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు మనం వేచి ఉండాల్సిందే. చూడాలి మరి ఈ రేసులో ఎవరు విజయం సొంతం చేసుకుంటారో..