Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hema: హేమ డ్రగ్స్ టెస్ట్‌లో కీలక మలుపు..?

Hema: ఇటీవల కాలంలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో (Rave party) ప్రముఖ టాలీవుడ్ నటి హేమ (Hema) పట్టుబడినట్లు అక్కడి పోలీసులు ప్రకటించడం టాలీవుడ్ (tollywood)లో తీవ్ర కలకలం సృష్టించిన సంగతి అందరికి తెలిసిన విషయమే . హేమ డ్రగ్స్ సేవించిందని, టెస్ట్ రిపోర్ట్ లో కూడా పాజిటివ్ గా వచ్చినట్లు బెంగళూరు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. అనంతరం విచారణకు వచ్చిన నటిని బెంగళూరు పోలీసులు (Bangalore Police) అరెస్ట్ చేశారు. అయితే హేమ బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చింది. అయితే పోలీసులు హేమని అరెస్టు చేసిన తరువాత, ఆమెపై వచ్చిన ఆరోపణలు చూసి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి అందరికి విదితమే. అయితే ఈ విషయంలో తాజాగా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంచలన లేఖ రాసింది. అలాగే మా అధ్యక్షుడు అయినా మంచు విష్ణును (Manchu Vishnu) కలిసి స్వయంగా కలిసి మరి ఆ లెటర్ అందజేసింది. దీంతో పాటు డ్రగ్స్ టెస్ట్ కు సంబంధించి తన రిపోర్టును కూడా మంచు విష్ణుకు అందజేసింది హేమ.

ఇక హేమ ఆ లేఖలో ‘నేను సుమారు దశాబ్ద కాలంగా మా అసోసియేషన్ లో సభ్యురాలిగా ఉన్నాను. అలాంటిది తనకు ఎటువంటి షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా, కనీసం వివరణ అడగకుంగా మా సభ్యత్వం నుంచి తొలగించడం అన్యాయం. బెంగళూరు రేవ్ పార్టీ ఉదంతంలో నాపై దుష్ప్రచారం జరిగింది. ఈ విషయంలో మా కూడా ఏకపక్షంగా వ్యవహరించింది. మా బైలాస్ ప్రకారం నాకు ముందుగా షోకాజ్ నోటీసు జారీ చేయాలి. కానీ అటువంటిదేమీ జరగలేదు. షోకాజ్ నోటీసుకు ఇచ్చిన వివరణ సరైనది కానప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా మా నుంచి నన్ను తీసెయ్యడం చాలా పెద్ద తప్పు. ఇటీవలె నేను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో నాకు నెగిటివ్ (positive) వచ్చింది. త్వరలోనే‌ పోలీసులు జరిపిన పరీక్షల వివరాలు బయటకు వస్తాయి. అందుకని మళ్లీ ‘మా’లో (maa) నా సభ్యత్వాన్ని కొనసాగించాలి. ఎందుకంటే డ్రగ్స్ కేసు విషయంలో నాకు ‘మా’ సపోర్ట్ కావాలి’ అని రాసుకొచ్చినట్లు సమాచారం.కాగా హేమ‌ లేఖను తీసుకున్న మంచు విష్ణు దాననిఇ అడ్వైజరీ కమిటీకి పంపిస్తామని, అనంతరం మా కమిటీ లో చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకుంటామని హేమకు హామీ ఇచ్చిన్నట్టు సమాచారం. చూడాలి మరి మా అసోసియేషన్ హేమ విషయంలో ఎలాంటి నిర్ణయం తినుకుంటుందో..