Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

HERO SURYA: విలన్‏గా మారనున్న సూర్య ఎందుకంటే..?

HERO SURYA: ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలతో చాలా బిజీగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం సూర్య కంగువ షూటింగ్ కంప్లీట్ చేసాడు.అలాగే మరో వైపు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (Director Karthik Subbaraju) దర్శకత్వంలో తన 44వ మూవీ చిత్రీకరణలో ఉన్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఫ్యాన్స్ కు భారీ అంచనాలు ఉన్నాయి . అలాగే మాస్ యాక్షన్ డ్రామాగా (Action drama) రాబోతున్న ఈ ప్రాజెక్టులో సూర్య… గ్యాంగ్ లీడర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు హిందీలో తెరకెక్కుతున్న సింగం మూవీలో కీలకపాత్రలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్నాడు. ఇదే కాకుండా ఇప్పుడు హిందీలో మరో ప్రాజెక్ట్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడట. అయితే ఈసారి హీరోగా కాదు.. విలన్ పాత్రలో కనిపించనున్నాడని వార్త వైరల్ అవుతుంది.

అయితే బీటౌన్ ఇండస్ట్రీలో 2004లో విడుదలైన ధూమ్ సినిమా (Dhoom movie) సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బైక్ రేసింగ్స్, కారు చేజింగ్ లతో సరికొత్త యాక్షన్ ప్రేక్షకులను బాగా అక్కర్శించే విదంగా చేసారు. ఇక ఈ తర్వాత రెండేళ్ల గ్యాప్ లోనే వచ్చిన ధూమ్ 2 సినిమా కూడా సూపర్ హిట్ కూడా సొంతం చేసుకుంది. ఇక దీంతో ధూమ్ 3 చిత్రాన్ని కూడా అడియన్స్ ముందుకు వచ్చారు. కానీ ధూమ్ 2, 3 చిత్రాలకు చాలా కాలం గ్యాప్ కూడా ఉంది. 2016లో రిలీజ్ అయిన ధూమ్ 3 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ విడుదలై ఎనిమిదేళ్లు అవుతున్నప్పటికీ ధూమ్ 4పై ఎలాంటి క్లారిటీ మాత్రం లేదు.

కానీ ప్రస్తుతం మరోసారి ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ (Interesting news)వైరలవుతుంది.ధూమ్ 1, 2, 3 చిత్రాలను అందించిన ఆదిత్య చోప్రా ఇప్పుడు ధూమ్ 4 కోసం కథనుసిద్ధం చేస్తునట్టు సమాచారం . గతంలో వచ్చిన మూడు పార్ట్స్ కంటే ఈసారి ధూమ్ 4 వేరేలెవల్ ఉంటుందని వార్త వినపడతుంది. అయితే ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారు అనే విషయంపై క్లారిటీ రాలేదు. కానీ తమిళ్ హీరో సూర్య ఇందులో విలన్ పాత్రలో రాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే యశ్ రాజ్ ఫిల్మ్స్ సూర్యతో సంప్రదింపులు చేశారని కుశ టాక్. విలన్ గా నటించేందుకు సూర్య కూడా గ్రీన్ సిగ్నల్ (Green signal) ఇచ్చాడని టాక్. త్వరలోనే దీనిపై అధికారిక మాత్రం ఇంకా రాలేదు చిత్ర యూనిట్ (cinimaunit)నుంచి.చూడాలి మరి ఎప్పుడు ఈ విషయంపై క్లారిటీ వస్తుదేమోఅని.