Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Janaka Aithe Ganaka: రెండు రోజుల ముందే యూఎస్ఏ ‘జనక అయితే గనక’ ప్రీమియర్ షో

Janaka Aithe Ganaka: ప్రజా దీవెన, హైదరాబాద్: భారత దేశంలో విడుదలకు రెండు రోజుల ముందు యూఎస్ఏలో ప్రీమియ ర్లను ప్రదర్శించనున్న ‘జనక అయి తే గనక’ (Janaka Aithe Ganaka) తెలుగు నటుడు సుహాస్ (Suhas)తదుపరి విడుదల సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన జనక అయితే గనక. ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వరదల కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. జనక ఐతే గనక ఇప్పుడు అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర సమర్పకుడు దిల్ రాజు (dillraju) ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో దిల్‌రాజు (dillraju) మాట్లాడుతూ.. జనక అయితే గనక ప్రీమియర్‌ షోలను అక్టోబర్‌ 10న అమెరికాలో షెడ్యూల్‌ చేశాం. హ్యాపీడేస్, శతమానం భవతి చిత్రాలను ముందుగా USAలో విడుదల చేసి ఆ తర్వాత ఇండియాలో విడుదల చేశాము. అందుకే అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ (Continue the sentiment_చేస్తూ ఇండియాలో విడుదలకు రెండు రోజుల ముందు జానక ఐతే గనకను యూఎస్‌ఏలో విడుదల చేయాలని ప్లాన్ చేశాం. యుఎస్ ప్రీమియర్‌లకు ముందు భారతదేశంలో రెండు పబ్లిక్ షోలను ఏర్పాటు చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అక్టోబర్ 6న విజయవాడలో ఒక షో అక్టోబర్ 8న తిరుపతిలో మరో షో ఉంటుంది. సుహాస్ స్వస్థలం విజయవాడ మా డైరెక్టర్ స్వస్థలం తిరుపతి. అందుకే ఆ స్థలాలను ఎంచుకున్నాం. అక్టోబర్ 12న పూర్తి స్థాయి విడుదలకు ముందు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా అక్టోబర్ 11న పెయిడ్ ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఆర్థిక రిస్క్ పూర్తిగా వారిదే కాబట్టి జనక ఐతే గనక కోసం తాము ఒక ప్రయోగాత్మక ప్లాన్‌తో ముందుకు వచ్చామని చెప్పారు. తాను ఇప్పటికే నాన్ థియేట్రికల్ హక్కులను విక్రయించినట్లు ఏస్ నిర్మాత వెల్లడించారు. ఈ చిత్రంలో సంగీత విపిన్ కథానాయికగా నటిస్తోంది. వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.