Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jani Master: జానీ మాస్టర్‌ కోసం గాలింపు .. అక్కడే ఉన్నాడు అంటూ..?

Jani Master: ప్రస్తుతం కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ (Jani Master) కు చెందిన వార్త వైరల్ గా మారింది. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదురు కున్నాడు. అయితే అతని కోసం మాత్రం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే మరో వైపు జానీ మాస్టర్ మాత్రం తన స్వస్థలం నెల్లూరులోనే ఉన్నాడన్న సమాచారంతో అక్కడి పోలీసులతో నార్సింగి పోలీసులు సంప్రదింపులు మొదలు పెట్టరు . అలాగే లైంగిక ఆరోపణలకు (Sexual accusations) సంబంధించి డ్యాన్స్ మాస్టర్ కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అలాగే ఈ కేసులో భాగంగా బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు.

అలాగే ఆమె నుంచి ఇప్పటికే సఖి, భరోసా బృందాలు తగిన వివరాలు కూడా సేకరించినట్టు సమాచారం. ఈ కేసులో నార్సింగి పోలీసులు మరిన్ని ఆధారాలు కనిపెటే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగా బుధవారం (సెప్టెంబర్ 18) బాధితురాలి ఇంటికి కూడా వెళ్లనున్నారు. మరోవైపు ఈ కేసులో భాగంగా సంచలన విషయాలు ఒక్కొక్కటి బయటకి వస్తున్నాయి. ఆమె మైనర్‌గా ఉన్నప్పటి నుంచే బాధితురాలిపై జానీ మాస్టర్ (Jani Master) లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు బయటకి వచ్చాయి. అంతేకాదు మతం మార్చుకుని , పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు కూడా పాల్పడినట్లు కూడా సమాచారం.

అయితే జానీ మాస్టర్‌పై చర్యలకు తెలుగు సినీ ఇండస్ట్రీ (Film industry) సంచలనం రేపింది. ఇందులో భాగంగానే బాధితురాలికి ఓ స్టార్ హీరో అండగా నిలబడ్డాడని సమాచారం . అంతేకాదు ఆమెకు మద్దతు పలుకుతూ సినిమా అవకాశాలు కల్పిస్తానని భరోసా కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇండస్ట్రీలోని ఇతర నిర్మాతలు కూడా బాధితురాలికి తగిన అవకాశాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని టాక్ వినపడుతుంది. ఇక మరోవైపు జానీ మాస్టర్ కేసుకు (Jani Master) సంబంధించి ఆందోళనలకు సిద్ధమవుతోంది బీజేపీ మహిళా మోర్చా. జానీని అరెస్ట్‌చేసి.. బాధితురాలికి న్యాయం చేయకపోతే పెద్దఎత్తున నిరసనలు చేస్తామని మోర్చా హెచ్చరించినట్టు సమాచారం. అలాగే ఒక హిందూ అమ్మాయిని ట్రాప్‌చేసి.. ఇలా మతం మారాలంటూ బెదిరించిన జానీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ కూడా చేసినటు సమాచారం.