Johnny Master: టాలీవుడ్ లో ప్రముఖ సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) వివాదం అనేక మార్పులు చోటు చేసుకుంది. ఇటీవల జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు, అలానే అత్యాచారం చేసినట్లు ఒక లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సంఘఠన పై జానీ పై కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేయడం జరిగిని . అనంతరం హైదరాబాద్ కు తీసుకొచ్చి, కోర్టులో కూడా హాజర పరిచారు. ఈ తరుణంలో కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజులు రిమాండ్ కూడా విధించింది. అనంతరం జానీని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా ఈ విషయంలో జానీ మాస్టర్ (Johnny Master) భార్య అయేషాపై (Ayesha) కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. మతం మారి తన భర్తను పెళ్లిచేసుకోవాలని, అయేషా వేధించేదని, పలు మార్లు దాడి కూడా చేసిందని సదరు యువతి అయేషాపై తిరిగి కేసు పెట్టింది. తాజాగా మరో విషయంలో జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదైనట్లు సమాచారం. అయేషా తాజాగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించిందని తెలుస్తోంది. ఈ కారణంతోనే అయేషాపై (Ayesha) మరో కేసు నమోదు అయ్యింది. ఇలా కేసు నమోదు అవ్వడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయేషాతో (Ayesha) పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు రెడీ అవుతున్నారన్న వార్త వైరల్ అవుతుంది.
ఈ క్రమంలో లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల (Sexual harassment) కేసులో జానీ మాస్టర్ ను 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేయనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణల నేపథ్యంలో అయేషా చేస్తోన్న వ్యాఖ్యలు మల్లి దుమారం రేపుతున్నాయి. అలాగే ’16 ఏళ్ల వయసులో రేప్ చేశాడని ఆ అమ్మాయి అంటుంది. దీనికి తగిన ఆధారాలు చూపాలని అయేషా డిమాండ్ కూడా చేసినటు సమాచారం. అలాగే జానీ మాస్టర్ భార్య కావాలనే తన భర్తను ఇరికిస్తున్నారంటోంది. ఇది తప్పుడు కేసు అని, జానీ మాస్టర్ పాన్ ఇండియా లెవల్ లో ఫేమస్ అయ్యాడని, అందుకే కొందరు ఓర్వలేకనే ఆయనను తొక్కేస్తున్నారంటూ అయేషా (Ayesha) ఆరోపణలు చేస్తుంది.