–సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఉన్నం దున విడుదల చేయాల్సిందే
–కర్ణాటక ప్రభుత్వ వైఖరిపై అత్యు న్నత న్యాయస్థానం తీవ్రఅసంతృప్తి
–ఘాటుగా స్పందించిన సుప్రీంకో ర్టు
Kamal Hassan : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: విడుదల కు ముందే సంచలనాలకు వేదికైన కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా కు బేషరతు అనుమతి ల భించింది. తీవ్ర వివాదాన్ని సృష్టిం చిన కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ విడుదల కు పచ్చ జెండా ఊపింది సర్వోన్నత న్యాయస్థానం. సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఉన్నందున, వివా దాలతో సంబంధం లేకుండా కర్ణాట కలో విడుదల చేయాల్సిందేనని సు ప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చే సింది. ఈ విషయంలో కర్ణాటక ప్ర భుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్య క్తం చేసిన అత్యున్నత న్యాయస్థా నం, 24 గంటల్లోగా వివరణ ఇవ్వా లని ఆదేశించింది.
కమల్ హాసన్ గతంలో కన్నడ భాష పై చేసిన కొన్ని వ్యాఖ్యలు (“కన్నడ తమిళం నుండే పుట్టింది”) వివాదా స్పదం కావడంతో, ‘థగ్ లైఫ్’ సిని మాను కర్ణాటకలో విడుదల చేయ నీయకుండా కన్నడ సంఘాలు అ డ్డుకున్నాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబ ర్ ఆఫ్ కామర్స్ కూడా సినిమాను నిషేధించాలని హెచ్చరించింది. జూ న్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై న ఈ సినిమా ఇప్పటివరకు కర్ణాట కలో ప్రదర్శనకు నోచుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు భద్రత కల్పించడంలో విఫలమైనందుకు కర్ణాటక ప్రభు త్వాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు బట్టింది.
“సెం ట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేష న్ (సీ బీఎఫ్‌సీ) అనుమతి పొందిన సిని మాను విడుదల చేయాల్సిందే. చ ట్టబద్ధమైన పాలన ఇదే చెబుతోం దని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యా నించింది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని కర్ణాటక హైకోర్టు సూచిం చడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుప ట్టింది. “జూన్ 3న హైకోర్టు కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోర డం సరికాదని పేర్కొంది.
తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, కన్నడ భాష పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని కమల్ హాసన్ చెబుతున్నప్పటికీ, క్ష మాపణ చెప్పేందుకు నిరాకరించా రు. ఈ కేసును కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు తనకు బదిలీ చే సుకుంది. “రాష్ట్రాన్ని అల్లరి మూక లు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారి నియంత్రణలోకి వెళ్లనివ్వలేమ ని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గత వి చారణలో వ్యాఖ్యానించిన విషయా న్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.