Keerthana: మన సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా పని చేసిన వారి యాక్టింగ్ (acting)గురించి ప్రతేయకంగా చెప్పక్కర్లేదు. పలు సూపర్ హిట్ చిత్రాల్లో కొందరు బాలనటీనటులు తమ అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం కూడా సొంతం చేసుకున్నారు. అలాగే కొందరు ప్రస్తుతం హీరోహీరోయిన్లుగా (heroes and heroines) ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక మరికొందరు మాత్రం సినిమాలకు దూరంగా ఉండిపోయారు. అలాంటివారిలో కీర్తన Keerthana) కూడా ఒకరు. సాధారణంగా ఈ పేరు సినీ ప్రియులకు అంతగా పరిచయం లేదు, కానీ అమృతా మూవీ చైల్డ్ ఆర్టిస్టు అంటే మాత్రం అందరికి ఇట్టే గుర్తు వస్తుంది. ఇక మన తెలుగు డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల్లో అమృతా ఒకటి. ఈ మూవీ 2002లో విడుదలైనభారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కూడా సొంతం చేసుకుంది. అలాగే ఉత్తమ తమిళ చిత్రం, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, ఉత్తమ సంగీత దర్శకుడు, సాహిత్యం, ఆడియోగ్రఫీ, ఎడిటింగ్ కేటగిరీలలో అవార్డులను కూడా వచ్చాయి. ఈ అమృత సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందకుంది బేబి పీఎస్ కీర్తన (Keerthana). ఆ చిన్నారి ఎవరో కాదు.. కోలీవుడ్ నటుడు కమ్ డైరెక్టర్ పార్తీబన్, నటి సీతల కూతరు.
తల్లిదండ్రులు ఇద్దరు నటీనటులు కావడంతో చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన అమృతా సినిమాలో సిమ్రాన్, మాధవన్ (Simran, Madhavan) ఇద్దరూ హీరోహీరోయిన్స్. అయినప్పటికీ కథ మొత్తం మాత్రం కీర్తన చుట్టూనే తిరుగుతుంది. ఈ మూవీని తన సొంత తల్లిదండ్రులను కలుసుకోవాలనే ఓ చిన్నారి పడే ఆరాటం, పోరాటం ఆధారంగా తీశారు ఈ సినిమా.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తన యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. అల్లరి పిల్లగా, భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనతో ప్రేక్షకులను కన్నీరు కూడా పెట్టించింది. కేవలం మొదటి సినిమాతోనే చైల్డ్ ఆర్టిస్టుగా ( child artist) ఎన్నో అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. కానీ అమృతా సినిమా అనంతరం మరో సినిమలో నటించలేదు.చదువుల దృష్ట్యా సినిమాలకు దూరంగా ఉండిపోయింది. అయితే ప్రస్తుతం కీర్తనకు వివాహం జరిగింది. ఆమె అత్తారిల్లు అక్కినేని ఫ్యామిలీ ఫిల్మీ బ్యాగ్రౌండ్ (Akkineni Family Filmy Background)చాలా పెద్దది అనే చెప్పాలి. కీర్తన భర్త పేరు అక్షయ్. ఇండస్ట్రీలో ఒక ఫేమస్ డైరెక్టర్. కీర్తన అక్కినేని వారింటి పెద్ద కోడలు. కానీ నాగేశ్వరరావు, నాగార్జున అక్కినేని ఫ్యామిలీ కాదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ ఎడిటర్ ఏ శ్రీకర్ ప్రసాద్ అక్కినేని. శ్రీకర్ తండ్రి అక్కినేని సంజీవి తెలుగులో అనేక సినిమాలను కూడా తీశారు. అంతేకాదు ఎల్వీప్రసాద్ కు సంజీవి సోదరుడు. ఇక కీర్తన భర్త అక్షయ్ హిందీలో పలు చిత్రాలనుకూడా తెరకెక్కించారు. ప్రస్తుతం కీర్తన పూర్తిగా ఫ్యామిలీని చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
