Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kollywood hero Vijay: విజయ్ లాస్ట్ మూవీ రెమ్యునరేషన్.. ఎన్నికోట్లో తెలిస్తే షాకే..?

Kollywood Hero Vijay: తమిళ సినిమా ఇండస్ట్రీలో చాలా పేరున్న నటుడు విజయ్ (Vijay). ఆయన భారతదేశంలోనే ఎక్కువ జీతం తీసుకునే నటులలో ఒకరు. ఇటీవల, భారతదేశం (India)లో ఎక్కువ పన్నులు (Taxes) కట్టే సెలబ్రిటీల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఇంతకంటే ముందు ఈ జాబితాలో చాలా మంది బాలీవుడ్ నటులు ఉండేవారు. ఇప్పుడు ఆయన సినిమాలకు బదులు రాజకీయాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. అందుకే, శనివారం సెప్టెంబర్ 14న తాను నటిస్తున్న చివరి సినిమా గురించి ప్రకటించారు. అంటే, ఇకపై ఆయన సినిమాల్లో నటించరు అని అర్థం.

తమిళ సినిమా ఇండస్ట్రీలో తాజాగా వస్తున్న వార్తల ప్రకారం విజయ్ నెక్స్ట్ సినిమా కోసం చాలా ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. విజయ్ 69 (Vijay69) సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇదే ఆయన చివరి సినిమా అని కూడా చెప్పారు. ఈ సినిమాను కన్నడ రాష్ట్రానికి చెందిన కేవీఎం ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది. ఈ సినిమా విజయ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా చేస్తున్న సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం విజయ్ కి మామూలు కంటే ఎక్కువ పారితోషికం ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

విజయ్69వ సినిమాకి నిర్మాతలు ఆయనకు 275 కోట్ల రూపాయలు ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు భారతదేశంలో ఎవరికీ ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం (Remuneration) ఇవ్వలేదు. దీన్ని బట్టి విజయ్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నిలిచిపోనున్నాడని చెప్పుకోవచ్చు. కొన్ని వారాల క్రితం భారతదేశంలో ఎక్కువ పన్నులు కట్టే వారి జాబితా వచ్చింది. ఆ లిస్ట్‌ లో విజయ్ రెండో స్థానంలో ఉన్నారు.

భారతదేశంలో ఎక్కువ సంపాదించే హీరోల జాబితాలో షారుఖ్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ మూడవ స్థానంలో ఉన్నాడు. ఆశ్చర్యకరంగా, తమిళ హీరో విజయ్ సల్మాన్ ఖాన్ కంటే ఎక్కువ డబ్బు ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కారణం, విజయ్ సంవత్సరానికి ఎక్కువ సినిమాలు చేస్తాడు. షారుఖ్ ఖాన్ మాత్రం సంవత్సరానికి ఒకే ఒక్క సినిమా చేస్తాడు.