Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Madhavan: రూ.17.5 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న హీరో మాధవన్

Madhavan :మన సౌత్ ఇండస్ట్రీలో డ్రీమ్ బాయ్ హీరో మాధవన్(Madhavan )గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు .. సినిమాలలో హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నారు మాధవన్ . అయితే ప్రస్తుతం మాధవన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో (social media) వైరల్ గా మారింది. అది ఏమిటంటే అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టిన మాధవన్.. తాజాగా కొత్త ఇంటికి యజమాని అయ్యాడు. లేటేస్ట్ తెలిసిన వివరాల ప్రకారం ముంబైలో మాధవన్ లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేసారు. ఇక ఈ కొత్త ఫ్లాట్ (new flat) ధర ఏకకంగ రూ.17.5 కోట్లు ఉంటుందని సమాచారం . త్వరలోనే తన కొత్త ఇంటికి ఫ్యామిలీతో షిఫ్ట్ అవ్వబోతున్నట్లు సమాచారం.ఇక సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో ఆర్. మాధవన్ తనదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.

అయితే మాధవన్‌కు (Madhavan) 2024 సంవత్సరం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఆయన నటించిన ‘షైతాన్’ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ చిత్రంలో ఆర్. మాధవన్ నెగిటివ్ పాత్రలో కనిపించి అభిమానులను ఒక్కసారిగా బాగా అక్కటుకున్నాడు. ‘షైతాన్’ సక్సెస్ తర్వాత మాధవన్ డిమాండ్ మరింత రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే తారలలో మాధవన్ కూడా ఒకరు అంటె నమ్మండి . ప్రస్తుతం ఈ హీరో తీసుకున్న కొత్త ఇల్లు 4,182 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో రెండు విశాలమైన పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఇది ఏ స్టార్ హోటల్‌లా విలాసవంతమైనది. మాధవన్ కొత్త ఇల్లు.

ఇక అజయ్ దేవగన్, జ్యోతిక, జానకి బోడివాలా (Ajay Devgan, Jyothika, Janaki Bodiwala)జంటగా నటించిన చిత్రం ‘షైతాన్’. ఈ సినిమాబాక్సాఫీస్ వద్ద 149 కోట్ల రూపాయలను వసూలు చేసింది. హారర్ ప్రేమికులను అలరించిన ‘షైతాన్’ విజయంతో మాధవన్ కెరీర్ మలుపు ఒక్కసారిగా తిప్పింది. ప్రస్తుతం ఆయన చేతిలో 5కి పైగా సినిమాలు ఉన్నటు సమాచారం. మాధవన్ (Madhavan) కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.