Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం..?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)ఫ్యామిలీని వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత సంవత్సరం మహేష్ బాబు ఇంట్లో ముగ్గురు మరణించిన సంగతి అందరికి తెలిసిందే. అమ్మ, అన్న, నాన్న ఇలా ఒకరితర్వాత ఒకరు మృతి చెందడం మహేష్ బాబు మానసికంగా బాగా కుంగిపోయారు. ఇప్పుడిప్పుడే మహేష్ ఆ బాధ నుంచి బయట పడుతున్నాడు అనుకునే లోపే మళ్ళి మహేష్ (mahesh) ఇంటిలో మరో విషాదం నెలకొంది. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ బావ, మహేష్ బాబు మావయ్య అయినా ప్రముఖ నిర్మాత అయిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు (Uppalapati Suryanarayana Babu)కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు.

ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. అతను కోలుకుంటున్నారు అని అనుకునేలోగా ఆదివారం రాత్రి సడెన్ గా గుండెపోటు (heart attack) రావడంతో ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు (Uppalapati Suryanarayana Babu) మరణించారని సమాచారం. దాంతో మహేష్ ఫ్యామిలి మొతం విషాదం నెలకొంది.ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు మరణ వార్తను నిర్మాతల మండలి సభ్యులు తెలియ చేసారు . ఆయన మరణానికి సినీ ప్రముఖులు అందరు సంతాపం తెలుపుతున్నారు. అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. ఇక సూర్యనారాయణ బాబు మహేష్ బాబుకు మావయ్య అవుతారు. సూపర్ స్టార్ కృష్ణ సోదరి లక్షీ తులసిని సూర్యనారాయణ బాబు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పద్మావతీ ఫిలింస్ బ్యానర్‌ను స్థాపించి సినిమాలను కూడా నిర్మించారు.

ఇక ఈ బ్యానర్ లో ‘శంఖారావం’, ‘బజార్ రౌడీ’, ‘అల్లుడు దిద్దిన కాపురం’, ‘అన్నదమ్ముల సవాల్’ లాంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకుల కోసం అందిచారు. సూర్యనారాయణ బాబు (Uppalapati Suryanarayana Babu)కేవలం తెలుగ లోనే కాదు , తమిళ్, కన్నడ భాషల్లోనూ సినిమాలను నిర్మించారు. చాలా కాలం సినిమా నిర్మాతగా ఉన్న ఆయన ఆతర్వాత వెళ్లగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక సూర్యనారాయణ బాబు నిర్మాతగానే కాదు రాజకీయం వైపు కూడా అడుగులేశారు . ఏకంగా నందమూరి తారకరామారావు మీద పోటీ కూడా చేశారు. 1985లో నందమూరి తారక రామారావుపై గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మళ్లీ రాజకీయాల వైపు కూడా వెళ్ళలేదు సూర్యనారాయణ బాబు (Uppalapati Suryanarayana Babu).