Nitin VS Naga Chaitanya: అల్లు అర్జున్ (Allu Arjun)పుష్ప 2 డిసెంబర్ 6న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి అందరికి విదితమే. డిసెంబర్‌లో విడుదల కావాల్సిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడింది.అదే నెలలో రావాలిసిన మెగాస్టార్ విశ్వంభర సమ్మర్ కి వాయిదా పడింది. డిసెంబర్‌లో విడుదల కానున్న నందమూరి బాలకృష్ణ, బాబీ (Nandamuri Balakrishna, Bobby )సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్నట్టు సమాచారం. దేనితో డిసెంబర్ నెలలో తర్జన భర్జనలు లేకుండానే పంచాయితీ ముగిసింది.
అయితే ఇప్పుడు డిసెంబర్‌లో విడుదల కానున్న సినిమాలపై మరో వివాదం ఏర్పడింది. బాలయ్య, చరణ్ లు తప్పుకోవడంతో ఇద్దరు యువ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి. నితిన్ (Nitin )హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మించిన చిత్రం రాబిన్ హుడ్. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో యువ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తున్నాడు. రాబిన్ హుడ్ డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అదే రోజు నాగ చైతన్య టాండల్‌ని విడుదల చేయాలనే ఆలోచనలో గీతా ఆర్ట్స్ వాళ్ళు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 25న క్రిస్మస్ ప్రారంభం కావడం, 31న నూతన సంవత్సరం ప్రారంభం కావడం వల్ల రెండు సినిమాలను ఒకే రోజు థియేటర్లలో విడుదల చేయాలి. రెండు సినిమాలు కూడా వారి కెరీర్‌కి చాలా కీలకం అనే చెప్పాలి. చైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో (budget) రూపొందిన చిత్రం తాండల్ – రూ. 75 కోట్లతో నిర్మించనున్నారు. చూడాలి మరి చివరికి ఎవరు విజయం సొంతం చేసుకుంటారో.