NTR: దేవర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం సినిమా దుమ్ములేపిందని చెప్పుకోవచ్చు. మాస్ అండ్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ (Saif Ali Khan, Janhvi Kapoor) నటించడంతో నార్త్ బెల్ట్ లో కూడా సినిమా బాగా ఆడింది. ఇక ఈ సినిమా తర్వాత తారక్ వార్ 2 సెట్స్ లో అడుగు పెట్టాడు. ఈ మూవీతోనే తారక్ నేరుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఎన్టీఆర్ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి విదితమే.
ఈ క్రమంలో ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్న తారక్ (Tarak).. ఇప్పుడు యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో తారక్ (Tarak) లుక్ నెట్టింట వైరల్ కావడంతో సమాచారం బయటకు పొక్కింది. కాగా ఈ చిత్రంలో తారక్ స్పై ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్టు భోగట్టా. అయితే ఈ రోల్ పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ప్రచారం కూడా జరుగుతుంది. కానీ దీనిపై వార్ 2 ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కనీసం ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. ఎన్టీఆర్ నటించడంతో ఈ సినిమా మీద మాత్రం ఓ రేంజులో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీలో తారక్ (Tarak) లుక్ గురించి ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో వార్ 2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ (ntr)ఫోటోస్ లీక్ కావడంతో చిత్ర యూనిట్ షాక్ అయ్యింది. కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆ ఫోటోలు చూసి సంబరాలు చేసుకుంటున్నారు. అవును, యాక్షన్ సీక్వెన్స్ షూట్ (Action sequence shoot) చేస్తున్నప్పుడు ఎవరో తన ఫోన్లో తీసిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందులో తారక్ బ్రౌన్ కలర్ టీ షర్ట్, ఆర్మీ షర్ట్ వేసుకుని నడుస్తూ ఉండడం గమనించవచ్చు. దాంతో మాస్ లుక్ లో ఎన్టీఆర్ వేరేలెవల్లో ఉన్నారంటూ ఫ్యాన్స్ ఆ ఫోటోస్ తెగ షేర్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ చూసేందుకు ఒకవైపు బాలీవుడ్ ఆడియన్స్ (Bollywood audience) నుండి ఇటు టాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 14న రిలీజ్ చేయనున్నారు.