NTR: ఎన్టీఆర్ ‘దేవర’ (devara) సినిమా కమర్షియల్ సక్సెస్ దిశగా దూసుకుపోతున్న సంగతి అందరికి విదితమే. దీనితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే సినిమాకి మిశ్రమ స్పందనలు వచ్చిన కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక డీసెంట్ కలెక్షన్స్ తో మూవీ థియేటర్స్ లో కొనసాగుతోంది. దసరా ఫెస్టివల్ వరకు ‘దేవర’ (devara) మూవీ సందడి ఉంటుందని మేకర్స్ అంచనా వేస్తన్నారు. అలాగే లాంగ్ రన్ లో ఈ సినిమాకి 600 వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని మేకర్స్ అంచనా అని టాక్ .
ఇదిలా ఉంటే ‘దేవర’ (devara)మూవీ టెన్షన్ తగ్గిపోవడంతో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల షూటింగ్ పై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఈ తరుణంలో మొదట హిందీ డెబ్యూ మూవీ ‘వార్ 2’ (war2) షూటింగ్ లో పాల్కొనబోతున్నట్టు సమాచారం. ఈ నెలలోనే ‘వార్ 2’ మూవీ కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలు షూటింగ్ ప్రారంభం కాబోతోందని సమాచారం . ఈ సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee)దానికి సంబందించిన ఏర్పాట్లు కేసుల రెడీ చేసు కుంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఆలాగే ఎన్టీఆర్ క్యారెక్టర్ కాస్తా గ్రే షేడ్స్ లో ఉంటుందనే టాక్ ఉంది. అతి త్వరలో ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశాలని షూట్ చేయబోతున్నారంట. ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ మీద ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ ‘వార్ 2’ (war2)తో ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా. అలాగే ‘వార్ 2’ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే, వచ్చే సంవత్సరం నుంచి ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ పైన తారక్ ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అది సెట్స్ పైన ఉండగానే ‘దేవర 2’ కూడా స్టార్ట్ చేయొచ్చని కూడా అంచనా.