Praneetha:” ఏం పిల్లో.. ఏం పిల్లడో.. ” సినిమాతో టాలీవుడ్ (tollywood)ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రణీత సుభాష్. టాలీవుడ్ లో బడా హీరోల సరసన నటించిన ఈవిడ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని అనేక సినిమాలు చేసింది. బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం ఇలా పలు సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఇక టాలీవుడ్ లో చివరిగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో (main role)నటించిన ” ఎన్టీఆర్ కథానాయకుడు ” చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఈవిడ కన్నడ, మలయాళ సినిమాలలో నటించింది. ఇకపోతే తాజాగా హీరోయిన్ ప్రణీత మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ” రౌండ్ 2 ” అంటూ తాను మరోసారి తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
ప్రెగ్నెన్సీ(Pregnancy) సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసి రౌండ్ 2.. ఇక ఈ ప్యాంట్స్ సరిపోవు అంటూ ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్టులో బేబీ బంప్ తో ఉన్న ఆవిడ కొన్ని ఫొటోస్ షేర్ చేస్తూ రౌండ్ 2 అని తెలిపింది. దీంతో ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన సినీ సంబంధికులు, అలాగే ఆమె అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.
2021లో బెంగళూరు నగరానికి చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని (Nitin raju) పెళ్లి చేసుకున్న ఆవిడ.. 2022లో జూన్ లో మొదటగా ఆడబిడ్డకు జన్మనివ్వగా., ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెన్సీ అంటూ గుడ్ న్యూస్ తెలిపింది. పాప పుట్టిన తర్వాత కూడా కొన్ని సినిమాల్లో మళ్ళీ నటించింది ప్రణీత. ఇక టాలీవుడ్ లో బాపు బొమ్మ ప్రణీత అంటూ ఆవిడను అభిమానులు ముద్దుగా పిలుస్తారు. ఇదివరకు ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో డాన్స్ షోలో కొన్ని ఎపిసోడ్స్ కు ప్రణీత జడ్జిగా కూడా వ్యవహరించింది.