Pushpa2 : అతి భారీ అంచనాలతో అల్లు అర్జున్ ‘పుష్ప-2’ (Pushpa2) పాన్ ఇండియాలో డిసెంబర్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సంగతి అందరికి విదితమే . అయితే ఇప్పడేటి వరుకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సహా జరిగిన బిజినెస్ చూస్తే అంచనాలు పీక్స్ కి చేరాయి. దీంతో ‘పుష్ప-2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందనే అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతాయి అన్నాట్టు ఉన్నాయి. అయితే ఎలాంటి అంచనాలు లేకుండానే 400 కోట్లకు పైగా రాబట్టింది. ఇంక అంచనాలతో వస్తే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి? హిట్ టాక్ తెచ్చుకుంటే ఫుల్ రన్ లో (full run)రణరంగం ఎలా ఉంటుంది? అనేది అభిమానులలో ఎక్కువా ఇంట్రెస్ట్ ఉంది.
అయితే తాజాగా ‘చావా’ కంటే ఒక్కరోజు ముందుగానే ‘పుష్ప-2’ (Pushpa2)రిలీజ్ అవుతుందనే వార్త అందరికి బాగా అక్కటుకుంటుంది. రెండు సినిమాలు డిసెంబర్ 6న రిలీజ్ అయితే నార్త్ లో కొంత ప్రభావం ‘పుష్ప-2′(Pushpa2) పై ఉంటుందని కూడా అంచనా. ఆలాగే ఓపెనింగ్స్ పరంగా అనుకున్న స్థాయిలో ఉండే అవకాశం ఉండదు. అందుకే ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న పాన్ ఇండియాలో రిలీజ్చేయబోతున్నట్టు సమాచారం . అదే జరిగితే ,మాత్రం ఓపెనింగ్స్ (openings) కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే చెప్పాలి
అనంతరం టాక్ ను బట్టి జనాలు థియేటర్ కి వెళ్తారు. ఆ రోజు తర్వాత ‘చావా’ రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఓపెనింగ్ కి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ‘పుష్ప -2’ మేకర్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరుకు అయితే ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఇక నిర్మాతలు క్లారిటీ ఇస్తే తప్ప సంగతేంటి? అన్నది క్లారిటీ లేదు.
అయితే అదే నెలలో రిలీజ్ అవ్వాల్సిన ‘గేమ్ ఛేంజర్’ కూడా వాయిదా పడుతున్నట్లు సమాచారం. ఇక అది కూడా జరిగితే ‘పుష్ప2’ కి కలిసొచ్చినట్లే అని చెప్పచు. ఇక అల్లు అర్జున్ (allu arjun) ‘పుష్ప-2’ హిట్ టాక్ తెచ్చుకుంటే వసూళ్లు సునామీ కొనసాగిస్తుందో లేదో చూడాలి మరి