Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి (Rajamouli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.. 2001లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా రాజమౌళి ఎన్టీఆర్ కి హీరోగా ఫస్ట్ బ్రేక్ అనే చెప్పాలి. ఇక రెండవ చిత్రం వీరిద్దరి కాంబినేషన్లో సింహాద్రి రాగ ఇది కూడా టాలీవుడ్ రికార్డ్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేసింది. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్ రెండో సినిమాకి దర్శకత్వం వహించిన సంగతి అందరికీ విదితమే.. ఇక రామ్ చరణ్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన సినిమా మగధీర.. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కించారు.
అంతేకాకుండా, భారీ బడ్జెట్ (Big budget) తో అల్లు అర్జున్ ఈ సినిమాకి నిర్మాతగా వహించిన కూడా బడ్జెట్ దాటి పోతుందని రాజమౌళికి పదేపదే గుర్తు చేసిన కానీ అతడు పట్టించుకోలేదట. చివరికి ఈ సినిమా కూడా టాలీవుడ్ రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుంది. అయితే, సినిమా విడుదలైన అనంతరం చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ రామ్ చరణ్ ది అని అన్నారని సమాచారం. కేవలం, రామ్ చరణ్ నటన ప్రతిభావాలనే మగధీర హిట్ అయిందని, భారీగా డబ్బులు వచ్చాయని పలు భాషలలో కూడా మగధీర (magadeera) రీమేక్ అయ్యిందని అన్నారు. అయితే, కొడుక్కి అంత భారీ హీట్ ఇచ్చినా రాజమౌళిని మాత్రం చిరంజీవి గుర్తించలేకపోయాడు. అంతేకాకుండా., పెద్ద మోతాదులో లాభాలు తీసుకున్న అల్లు అరవింద్ (allu arvind) కూడా ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదని పైగా రిస్క్ చేసి మరి భారీ బడ్జెట్ తో మగధీర సినిమాని తీసినందుకు, ఫలితం కూడా నాకు ఒక్కడికే అన్నట్లు ప్రవర్తించారని సమాచారం.
అయితే., చిరంజీవి మాటలకు హార్ట్ అయిన రాజమౌళి (Rajamouli).. కమెడియన్స్ సునీల్ ను హీరోగా పెట్టి “మర్యాద రామన్న” హిట్ సొంతం చేసుకున్నాడని, అలాగే అప్పట్లో చిన్న హీరో అయిన నానితో ఈగ సినిమాతో హిట్ సొంతం చేసుకుని పరోక్షంగా సందేశం పంపించాడని టాక్. అయితే ఇది ఇలా ఉండగా అల్లు అరవింద్, చిరంజీవి మగధీర విషయంలో ప్రవర్తించిన తీరు రాజమౌళికి నచ్చక ఇకపై మెగా హీరోలతో సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట. అందుకేనేమో అల్లు అర్జున్ తో ఒక సినిమా కూడా రాజమౌళి తీయలేదు. ఇది ఇలా ఉండగా మరోవైపు చిరు పై రాజమౌళికి కోపమే ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోగా రామ్ చరణ్ ఎందుకు ఎంపిక చేసుకుంటాడు.. ఎన్టీఆర్ కు దీటుగా రాంచరణ్ (RAM CHARAN)పాత్రను ఎలా రూపొందిస్తాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..