Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ram Charan: ‘గేమ్ చేంజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లేనా

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)రాబోయే కొత్త సినిమా గేమ్ చేంజర్ సినిమాపై రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్లు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. భారతదేశ సినీ ఇండస్ట్రీలో (cinima industry) టాప్ డైరెక్టర్ లో ఒకరు శంకర్. ఈయన దర్శకత్వంలో ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలతో వస్తున్న నేపథ్యంలో సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు శంకర్ రామ్ చరణ్ (Ram Charan) ఎలాంటి లుక్ లో చూపించబోతున్నాడు..? అలాగే అసలు కదా ఏమిటా..? అని అనేక ప్రశ్నలు ఫ్యాన్స్ లో ఉన్నాయి.

ఇక ఇది ఇలా ఉండగా.. సోషల్ మీడియాలో (social media) ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. కొద్దీ రోజుల క్రితం ఒక సాంగ్ రిలీజ్ చేయడం తప్ప ఎటువంటి అప్డేట్స్ లేవని ఫాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే తాజాగా తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ అయినట్లు ఒక వార్త వైరల్ గా చక్కర్లు కొడుతుంది. ఇక మరోవైపు శంకర్ ప్రస్తుతం కమలహాసన్ తో భారతీయుడు సినిమాతో పాటు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ (Game Changer)సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయాలని మేకర్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వార్త ఆధారంగా.. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా.. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని టాక్.

ఒకవేళ ఆ రోజున మిస్ అయితే డిసెంబర్ 24 కచ్చితంగా రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఇక ఈ వార్తలలో అసలు నిజం ఏంటన్నది సినిమా టీం నుంచి అప్డేట్ వస్తే కానీ తెలియదు..ఇక మరోవైపు ఈ సినిమా నిర్మాత దిల్ రాజు (dill raju )ప్రస్తుతం అమెరికాలో తన ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నారు. దిల్ రాజు ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ సినిమా డేట్ రివాల్వ్ చేయవచ్చని ఒక అంచనా.