RENU DESAI: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ (PAWAN KALYAN) ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినీనటి రేణు దేశాయ్ (RENU DESAI) 2009 లో వివాహంచేఉకోని ఆ తర్వాత విడిపోయారు. ఇక వీరి ఇద్దరికీ వివాహము కాకముందే అకిరా (AKIRA) నందన్ పుట్టాడు. అనంతరం 2012 లో వీరిద్దరూ అధికారికంగా విడిపోయారు. ఇక అనంతరం రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ (PAWAN KALYAN) ఎప్పుడూ కూడా కలిసింది లేదు, కానీ వారిద్దరికీ పుట్టిన పిల్లలు మాత్రం మెగా ఫ్యామిలీలో కలిసిపోయారు. అంతేకాకుండా అకిరా కూడా ఎప్పుడు పవన్ తో పాటు ఉండడం.. అలాగే పవన్ ఎక్కడికి వెళ్లినా కానీ అక్కడికి అకిరాని కూడా తీసుకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల చంద్రబాబు నాయుడు (CHANDRA BABU), నరేంద్ర మోడీ (MODI)తో అకిరా కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉండగా మరోవైపు రేణుదేశాయ్ ఇంస్టాగ్రామ్ (INSTAGRAM) వేదికగా అకిరా ప్రముఖులతో కలిసిన ఫోటోలను తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ షేర్ చేశారు. ఇక మరోవైపు రేణు ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంది. అది ఏమిటి అంటే.. పవన్ మూడో భార్య ఫోటోలు రేణు దేశాయ్ క్రాప్ చేసి కేవలం పవన్, అకిరా మోడీలు మాత్రమే కనిపించేలాగా ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దీంతో ఆమెపై అనేక ట్రోల్స్ వచ్చాయి. పవన్ ప్రస్తుత భార్యను చూసి నువ్వు ఓర్వలేక పోతున్నావా.. అంటూ కామెంట్స్ చేసిన వారికి ఆమె తీవ్రంగా స్పందించింది.
ఇక తాజాగా రేణు దేశాయ్ (RENU DESAI) మరో ట్రోల్ కి స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడం విశేషం. సుధాకర్ అనే ఒక పవన్ అభిమాని రేణు దేశాయ్ సోషల్ మీడియా ద్వారా ట్యాగ్ చేస్తూ ”సుధాకర్ గారు.. మీకు కొంచెమన్న బుద్ధి ఉంటే ఇలా చెప్పరు. పవన్ కళ్యాణ్ ను నేను వదిలేయలేదు. అతనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి ఇలాంటి కామెంట్స్ పెట్టి” అంటూ రేణు దేశాయ్ ఆగ్రహం వక్తం చేశారు. అయితే ఇన్ని రోజులు రేణు దేశాయ్ (RENU DESAI) పవన్ ప్రవర్తన నచ్చక దూరమైందని అనుకున్నారు. కానీ., ఒక్కసారిగా రేణు దేశాయ్ రిప్లై ఇవ్వడంతో అందరికీ క్లారిటీ వచ్చింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు ఈవిడను వదిలేసి., రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.. ఇలాంటి ప్రశ్నలు కొంతమంది అడుగుతున్నారు.