Renu Desai: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (pawan kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai)గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇటీవల కాలంలో రేణు దేశాయ్ సోషల్ మీడియాలో (social media) బాగా యాక్టివ్ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో రేణు దేశాయ్ (Renu Desai) యాక్టివ్ గా ఉంటూ.. పవన్ కళ్యాణ్ తన పిల్లలు కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో తన మాజీ భర్త పిల్లలు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం మనం గమనించాం. ఇక రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియోలలో పవన్ కళ్యాణ్ (pawan kalyan) మూడో భార్యను క్రాప్ చేసి షేర్ చేశారు. వీటిపై నెటిజన్స్ (netizens) వివిధ రకాల ప్రశ్నలకు రేణు దేశాయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సంగతి కూడా మనకు తెలుసు.
అయితే తాజాగా రేణు దేశాయ్ (Renu Desai) మరొకసారి సోషల్ మీడియాలో ఒక తాజా పోస్ట్ చేస్తూ.. నా కూతురు ఈ ఉదయం చాలా ఏడ్చిందని., తల్లి గురించి ఒక దరిద్రపు మీ పేజీలో చూసి నా కూతురు జీర్ణించుకోలేకపోయింది అంటూ రాసుకు వచ్చింది. మీరందరూ కూడా సెలబ్రెటీలు, పొలిటిషన్ ఫ్యామిలీల గురించి ఇంత కామెడీ చేస్తారా..? మీకు కూడా తల్లులు, చెల్లెలు, కూతుర్లు ఇంట్లోనే ఉన్నారు కదా.. మీకు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటే ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఏడిపించే పని ఉంటుందా..? అంటూ తన బాధను వ్యక్తపరిచింది. నా కూతురు పడిన బాధ, కన్నీళ్లు మీకు ఎంత అనర్ధానికి తీస్తాయో కూడా మీకు తెలుసా..? పేజ్ నడిపే వాళ్ళందరూ దారుణమైన మనుషులు. ఒక తల్లిగా నా శాపాన్ని మీరు తట్టుకోవాల్సిందే అంటూ రాసుకు వచ్చింది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తున్నాను అంటూ రేణు దేశాయ్ (Renu Desai) రాసుకొచ్చింది.