Sai Pallavi: టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్లలో సాయి పల్లవి (Sai Pallavi) కూడా ఒకటి. అది తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో సాయి పల్లవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని మంచి పేరును సొంత చేసుకుంది. ఇక ఈ అమ్మడు శేఖర్ కమలా దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో (Fidha movie) తెలుగు ఇండస్ట్రీలోకి (Telugu Industry) అడుగుపెట్టి అందర్నీ ఆకట్టుకుంది. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు తమిళ్లో కూడా సినిమాలు చేస్తూ మంచి పేరును సొంతం చేసుకుని ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది.
ప్రస్తుతం టాలీవుడ్ లో నాగచైతన్య ( Naga Chaitanya)హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి (sai pallavi) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇది ఇలా ఉండగా ఇటీవలే సాయి పల్లవి చెల్లెలు పూజ పెళ్లి జరిగిన సంగతి అందరికీ తెలిసినదే. సాయి పల్లవి. పూజ పెళ్లిలో (pooja) చేసిన సందడి కి సంబంధించిన వీడియోలు . ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యాయి. ఇక మరోవైపు సాయి పల్లవి ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నా అని అభిమానులలో ఒక చర్చ ప్రారంభం అయింది..
అయితే సాయి పల్లవి మాత్రం గత పది ఏళ్లుగా ఒకరితో రిలేషన్ షిప్ (Relationship)లో ఉన్నట్లు తెలిపి ఒక్కసారిగా ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది.. అవును మీరు విన్నది నిజమే సాయి పల్లవి ఒకరితో రిలేషన్షిప్ (Relationship) లో ఉందని ఆమె స్వయంగా తెలియజేసింది. మహాభారతంలో అర్జునిడి కుమారుడైన అభిమన్యుడి గురించి ఆమె చాలా విషయాలు చదివి తెలుసుకుంది అని , గత 10 ఏళ్లుగా అభిమన్యుడు క్యారెక్టర్ గురించి చాలా తెలుసుకున్నానని, అతనితో 10 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నా అని తెలిపింది సాయి పల్లవి తెలిపింది . ఇక ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలీవుడ్ లో సాయి పల్లవి నటిస్తున్న రామాయణం సినిమాలో సీతగా నటిస్తుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది.