Shruti Haasan:ప్రముఖ నటుడు కమల్ హాసన్ ( Kamala Hassan) కూతురు శృతిహాసన్ ( Shruti Hassan)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. శృతిహాసన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన తండ్రిపై ఆధారపడకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాకుండా తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఆపై అనేక విమర్శలు ఎదుర్కొని ఐరన్ లెగ్ (iron leg)అంటూ ముద్ర వేసుకుంది. ఇక ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అనేక రికార్డులను సొంతం చేసుకుంది. కేవలం తెలుగు భాషలోనే కాకుండా హిందీ, తమిళ భాషలలో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ (super hit)విజయం సాధించింది. గత సంవత్సరం సాలార్ సినిమాలో ప్రేక్షకులను మెప్పించిన శృతిహాసన్ ప్రస్తుతం సాలార్ 2(salaar 2) సినిమాకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇక అంతేకాకుండా శృతిహాసన్ సోషల్ మీడియాలో (social media)కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ రీల్స్(reel) చేస్తూనే అభిమానులను ఆకట్టుకుంటుంది.. ఇక తాజాగా శృతిహాసన్ ఇంస్టాగ్రామ్ (Instagram)లో తన ఫాలోయర్స్ తో చిట్ చాట్ (chitchat)చేసింది. ఈ తరుణంలో శృతిహాసన్ తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వచ్చింది. ఈ తరుణంలో ఒక అభిమాని సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పండి అని అంటూ అడగ్గా.. శృతిహాసన్ స్ట్రాంగ్ కౌంటర్ (counter) ఇచ్చింది.. “ఈ రకమైన జాతి వివక్షను నేను అసలు సహించను. మమ్మల్ని ఇడ్లీ, సాంబర్ అంటూ పిలిస్తే ఊరుకునేది లేదు. మీరు మమ్మల్ని ఎప్పటికీ అనుకరించలేరు. కాబట్టి సౌత్ ఇండియన్స్ లా ఉండాలని ఎప్పటికీ ట్రై చేయకండి. ఎలా పడితే అలా పిలిస్తే దాన్ని కామెడీగా తీసుకోము.
సౌత్ ఇండియన్ (south indian)భాషలో ఏదైనా చెప్పమని అడిగావు కదా.. నోరు మూసుకుని వెళ్లు అంటూ తమిళంలో శృతిహాసన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక మొదటి నుంచి సౌత్ నటీనటులపై బాలీవుడ్ స్టార్స్ ఎప్పటికీ చిన్నచూపు చూపిస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక దక్షిణాది వారి ఇడ్లీ, సాంబార్ అంటూ పిలుస్తూ కామెడీ అంటూ సమర్ధించుకుంటారు. గతంలో కూడా ఇలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైతం ఇడ్లీ వడ అంటూ కామెంట్ చేయగా.. ప్రస్తుతం శృతిహాసన్ కూడా పరోక్షంగా అతడికి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శృతిహాసన్ చేసిన కామెంట్స్ చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.