Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Shruti Haasan: శృతి హాసన్ కీలక నిర్ణయం, అసలేమైందో తెలుసా

ప్రజా దీవెన, హైదరాబాద్ : ప్రము ఖ సినీ నటి శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ కుమార్తెగా సినీ ప్రపంచానికి పరిచయమైన ఆమె తనకంటూ ప్రత్యేకమైన గు ర్తింపు తెచ్చుకుంది. మధ్యలో ప్రేమ వ్యవహారం నడిపి సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన ఆమె ఆ తర్వా త మళ్లీ సినిమాల్లో బిజీ అయింది.

చివరిగా ఆమె ప్రభాస్ హీరోగా న టించిన సలార్ సీజ్ ఫైర్ పార్ట్ వన్ లో కనిపించింది. తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకరేట్ సినిమాలో నటించాల్సి ఉంది కానీ యాటిట్యూడ్ కారణాలు అని చె బుతూ ఆమె తప్పుకున్నట్లు తెలు స్తోంది. ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ ను రంగంలోకి దించారు. అయితే ఆమె కేవలం డెకాయిట్ సినిమా మాత్రమే కాదు మరో రెం డు సినిమాల నుంచి కూడా తప్పు కున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి కన్నడ సినిమా కాగా మరొక టి ఇంటర్నేషనల్ లెవెల్ లో తెర కెక్క వలసిన చెన్నై స్టోరీ అనే సిని మా. అయితే సినిమాల నుంచి ఆమె తప్పుకుంటుందా లేక తప్పి స్తున్నారా అనే విషయం మీద మా త్రం క్లారిటీ లేదు. ఎందుకంటే శృతి హాసన్ తో పనిచేయడం చాలా కష్టమని ఆమెతో సినిమాలు చేసిన నటీనటులు చెబుతున్నారు.

ఒక సారి ఆ కారణం వల్లే ముందుగా తెలియక ఆమెను తీసుకున్నా సరే విషయం అర్థమైన తర్వాత ఆమె ను సైడ్ పెడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఏదై తేనేం ఆమెను తప్పిస్తేనేమిటి, తప్పుకుంటేనేమిటి మొత్తానికి ఆమె సినిమాల నుంచి పూర్తిగా పక్కకు వచ్చేస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని సరిదిద్దుకోకపోతే తన తండ్రి కమలహాసన్ లాగా లాంగ్ రన్ అయితే ఇక్కడ కష్టమే. ఎందుకంటే హీరోయిన్లకు మామూలుగానే టైం పీరియడ్ తక్కువ ఉంటుంది. దానికి తోడు ఇలాంటి కంప్లైంట్స్ వస్తే సినిమాలు ఆమెకు లభించే అవకాశం అయితే కష్టమే అని చెప్పవచ్చు.