Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Siddharth – Aditi Rao: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్

Siddharth – Aditi Rao: హీరో సిద్దార్థ్ (Siddharth ), అదితిరావులు (Aditi Rao) పెళ్లిచేసుకోబోతున్నారని అందరికీ తెలుసు. అయితే పెళ్లి డేట్‌పై వాళ్లిద్దరూ ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు. ఆ మధ్య వీరిద్దరూ సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చారు. టాలీవుడ్‌లో ఈ కపుల్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. హీరో సిద్ధార్థ్ విషయానికి వస్తే బాయ్స్ సినిమా, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అదేవిధంగా తమిళ్‌లో సూపర్ హిట్ సినిమాలు చేసి అక్కడ కూడా ప్రత్యేక ఫ్యాన్స్‌ను (fans) సొంతం చేసుకున్నాడు.

ఇక హీరోయిన్ అదితిరావు (Aditi Rao) కూడా తెలుగులో సమ్మోహనంలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. సుదీర్ బాబు హీరోగా చేసిన ఆ మూవీ మంచి హిట్ అందుకుందని చెప్పాలి. ఆ తర్వాత ఈ బ్యూటీ సిద్ధార్థ్‌తో కలిసి మహాసముద్రం మూవీలో నటించింది. ఆ మూవీ షూటింగ్ టైమ్‌లోనే సిద్ధార్థ్, అదితిరావు ప్రేమలో పడ్డారట. మహాసముద్రం (maha samudram)మూవీ తర్వాత వీరిద్దరూ మీడియా కంట చాలాసార్లు పడ్డారు. దీంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ (Love track)నడుస్తోందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి.

కొన్నాళ్లపాటు రిలేషన్‌షిప్‌లో (relationship)ఉన్న వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చారు. తాజాగా హీరోయిన్ అదితిరావు మాట్లాడుతూ..ప్రేమ, పెళ్లి (Love and marriage) అనేవి తన లైఫ్‌లో ఎంతో ముఖ్యమైన విషయమని, తనకు నాన్నమ్మ అంటే చాలా ఇష్టమని, త్వరలోనే తాను పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు చెప్పుకొచ్చింది. అదేవిధంగా తమ ప్రేమ విషయం గురించి కూడా చెప్పింది. ఓ స్కూల్‌లో సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేసినట్లు తెలిపింది. తమకు హైదరాబాద్‌లో ఓ స్కూల్ ఉందని, ఆ స్కూల్‌లో మోకాళ్లపై కూర్చోని సిద్ధార్థ్ తనకు లవ్ ప్రపోజ్ చేశాడని చెప్పుకొచ్చింది. ఇకపోతే శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలోనే తమ పెళ్లి జరుగుతుందని, పెళ్లి డేట్ ఫిక్స్ అయిన వెంటనే అందరికీ చెబుతానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి ఈ స్టార్ జంట పెళ్లి వార్తతో వారి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.