Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sonu Sood: మరో సారి మాట నిలబెట్టుకున్న సోనూసూద్

Sonu Sood: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ (Sonu Sood)తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన ఓ పేద విద్యార్థికి సహాయం (Help a poor student) చేస్తా అని మాట ఇచ్చాడు. మరోసారి తానే నిజమైన హీరో అని నిరూపించుకున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బనవ నూరుకు చెందిన దేవి కుమారి బీఎస్సీ చదవాలని కలలు కంటుంది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆమెను చదువుకోనివ్వడం లేదు. ఈ విషయంలో నాకు సహాయం చేయండి సార్ అంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో (social media) వీడియో షేర్ చేశాడు.


ఈ వీడియో చూసిన సోనూసూద్ (Sonu Sood) వెంటనే స్పందించారు. ‘నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండు’ అతను సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం దేవీ కుమారి చదువుకు కావాల్సిన సాయం (helping)చేశారు సోనూ సూద్. దీంతో సదరు విద్యార్థిని ఇంట్లో ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా సోనూ సూద్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసింది దేవీ కుమారి. ‘మా కుటుంబం ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కానీ, నాకు చదువుపై ఎంతో ఆసక్తి ఉంది. ఇంట్లో ఉన్న పరిస్థితుల రీత్యా అమ్మానాన్నలు నా చదువును మధ్యలోనే ఆపేయాలనుకున్నారు. నా కలలన్నీ ఆవిరయ్యాయని బాధ పడ్డాను. అలాంటి సమయంలో సోనూసూద్‌ సార్ నాకు అండగా నిలిచారు. నా చదువుకు కావాల్సిన సాయం అందజేశారు. ఆయన ఇప్పుడు నాకు దేవుడితో సమానం’ అని దేవీ కుమారి హర్షం వ్యక్తం చేసింది .


ఇదే వీడియోను సోనూ సూద్ ట్విట్టర్‌లో (twitter)షేర్ చేశాడు. “మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.” మాకు కాలేజీలో అడ్మిషన్ వచ్చింది. ఈ ఆంధ్రా అమ్మాయి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరేలా చేసి కుటుంబం గర్వపడేలా చేద్దాం. ఈ విషయంలో నాకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని సోనూ సాద్ తెలిపారు.