Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Syed Sohel : సోహైల్ ఇంట తీవ్ర విషాదం..?

Syed Sohel : తాజాగా నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ (Syed Sohel ) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకోవడం చాల బాధ కరం. తాజాగా సోహైల్ తల్లి ఫైమా సుల్తానా (Mother Faima Sultana)మంగళవారం (సెప్టెంబర్ 17) మధ్యాహ్నం మృతి చెందారు. గడిచిన కొన్ని రోజులుగా ఆమె కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆస్పత్రిలో (hospital) చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సొహైల్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు (Film celebrities, fans, netizens) సోహైల్ కు ధైర్యం చెప్పడం మొదలు పెట్టారు. అతని తల్లి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరికొందరు నివాళులు అర్పిస్తున్నారు. అయితే సోహైల్ స్వస్థలం తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతం. దీంతో తల్లి పార్థివ దేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కరీనంగర్ కే తరలించినట్టు సమాచారం . సోహైల్ కు తండ్రి సయ్యద్ సలీం, తమ్ముడు సయ్యద్ నబీల్ ఉన్నారు. కాగా ఫైమా సుల్తానా గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాగా ఇబ్బంది పడుతుంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు డయాలసిస్ కోసం ఆమెను హైదరాబాద్ లోని మెడి కవర్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.

అయితే మంగళవారం ఫైమా ( Faima Sultana))పరిస్థితి పూర్తిగా విషమించి మృతి చేయిందినట్టు తెలుస్తోంది.ఇది ఇలా ఉండగా సోహెల్ ఫిలిం కెరీర్ విషయానికొస్తే వరుణ్ సందేశ్ మొదటి సినిమా ‘కొత్తబంగారు లోకం’ తోనే ఇతను కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అయితే ఈ సినిమాలో అతనిది కనీకనిపించని పాత్ర . ఆ తర్వాత ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ తదితర సినిమాల్లో సైడ్ ఆర్టిస్టుగా కూడా కనిపించాడు. అలాగే సోషల్ మీడియాలో బాగా క్రేజ్ రావడంతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత హీరోగా కూడా మారిపోయాడు. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు వంటి సినిమాలలో హీరోగా నటించాడు సోహైల్ (sohel). ఈ సినిమాలు కథల పరంగా సినిమాల సెలెక్షన్స్ బాగున్నా ఇవేవీ కమర్షియల్ గా వర్కవుట్ మాత్రం అవ్వలేదు.