Unstoppable Season 4: హీరో బాలకృష్ణ (Balakrishna) సరికొత్తగా కనిపించి ఫ్యాన్స్ అందరిని ఫిదా చేసిన టాక్ షో.. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. ఈ షో తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ (streaming)అయిన ఈ టాక్ షోకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇది ఇలా ఉండగా ఈ షో(show) ఇప్పటి వరకు జరిగిన 3 సీజన్‌ల విజయవంతంగా ముగిసాయి. తాజాగా 4వ సీజన్‌ను ప్రారంభించేందుకే మేకర్స్ రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా విడుదల చేసారు.
కాగా సీజన్ 4 ప్రకటనకు సంబంధించి మేకర్స్ (makers)సరికొత్తగా ఆలోచించారు. అన్‌స్టాపబుల్ నాలుగో సీజన్ అనౌన్స్ చేసి సరికొత్త ప్రోమోని కూడా విడుదల చేసారు. ఇందులో బాలయ్య (Balayya)యానిమేటెడ్ సూపర్ హీరోగా కనిపిచడం అందరిని బాగా అక్కటు కుంటుంది. ప్రస్తతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ముఖ్యంగా చిన్నారులు ఈ సూపర్ హీరో క్యారెక్టర్‌కు బాగా కనెక్ట్ అయ్యారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆహా టీమ్ ఈ ప్రోమోకు (promo) సంబంధించి మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఈ వీడియోలో బాలయ్యను ఎలా షూట్ చేశారు. సూపర్ హీరో (Super hero) క్యారెక్టర్‌ను రూపొందించేందుకు టీమ్ ఎంతలా కష్టపడందన్న విషయాన్ని చాల వివరంగా చూపించారు. ఈ ప్రాసెస్ కోసం ఆహా టీమ్ ఎంతో ఎంజాయ్ చేసినట్లు ఈ ప్రోమో చూస్తే మనకి ఇట్టే అర్థం అవుతుంది. బాలయ్య బాబు డైలగ్స్ చెబుతూ, జై బాలయ్య అంటూ ప్రోమో ను విడుదల చేసారు. ప్రస్తుతం ఈ ప్రోమో మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఇదిలా ఉంటే సీజన్4 తొలి ఎపిసోడ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఉండబితునట్టు సమాచారం. ఈ ఎపిసోడ్‌కి సంబంధించి నేడు షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఈ షోలో పాల్గొన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి పాల్గొంటుండడం అందరిని అక్కట్టు కుంటుంది. ఇదిలా ఉంటే తాజా ఎపిసోడ్‌లో అల్లు అర్జున్, సూర్య, దుల్కర్ సల్మన్‌తో (Allu Arjun, Suriya, Dulquer Salmaan) పాటు సమంత కూడా హాజరుకానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయం పై క్లారిటీ రావాలి అంటే ఎపిసోడ్ రీలీజ్ అవ్వాల్సిందే..