Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Anjaneyaswami: ఆంజనేయస్వామికి మాల రూపం లో తమలపాకులను ఎందుకు వేస్తారో తెలుసా

Anjaneyaswami: ప్రజా దీవెన, హైదరాబాద్: సీతమ్మ తల్లిని (Seethamma’s mother) రాముడు అప హరించాడు. రామచంద్రుడు సీత మ్మ కోసం అన్వేషణ మొదలుపె ట్టాడు. రామునికి అన్వేషణలో సాయడపడుతోన్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీత మ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు. అతడు వెళ్లేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది. అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు (the flowers)ఆమె చేతికి అందవు. దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి, ఆంజనేయుని తలమీద పెట్టి దీవిస్తుంది. అందుకే ఆంజనేయుని తమలపాకు ప్రీతిపాత్రమైనది.

అది మాత్రమే కాదు. సీతమ్మ వద్దనుంచి తిరిగి వెళ్తూ… ఆకాశంలో పయనిస్తూ… గట్టిగా హూంకరిస్తాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది. ఆంజనేయుడు కచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వేయి కళ్లతో ఆంజనేయుడి కోసం ఎదురు చూస్తారు. అతడు రాగానే తమలపాకుల (betel leaves) తీగలతో సన్మానం చేస్తారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అందువల్లే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కుమ్మరిస్తాడని అంటారు.

హనుమంతుడు జ్యోతి స్వరూపుడు (Jyoti form). ఆయన్ని పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి. అవరోధాలు తొలగిపోతాయి. అందుకే ప్రతి మంగళ, శనివారాల్లో హనుమంతునికి ప్రపంచ వ్యాప్తంగా పూజలు జరుగుతాయి. పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను సమర్పిస్తే మనోభీష్టాలు నెరవేరతాయి. అది మాత్రమే కాక హనుమాన్ చాలీసాను సైతం పారాయణం చేస్తే సర్వసంపదలూ సుఖసంతోషాలూ వెతుక్కుంటూ వస్తాయి.

ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అఖ్ఖర్లేదు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది.

అదేంటంటే- ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల (betel leaves) చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు. అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు.

స్వామివారు ఎక్కువగా తమలపాకు (betel leaves) తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.

* ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె మంత్ర సంభందమైన పీడలు తొలగిపోతాయి.

* స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది.

* స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు.

* వ్యాపారం చేసి సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా, దానం చేస్తే వ్యాపారం భాగుపడుతుంది.

* స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు.

* శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.

* సుందర కాండ పారాయణం (Sundara Kanda Recitation) చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె అన్ని కార్యాలలో విజయం సిదిస్తుంది.

* హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తె పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది.

* తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది.పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు.