Benefits Of Junnu: నిజానికి జున్ను (Junnu)పాలు ఆవు లేదా గేదె ప్రసవించినప్పుడు మొదటిసారిగా వచ్చే పాలతో తయారు చేసేదే జున్ను. అంతేకాకుండా పాలను కూడా బాగా మరగకాచి జున్నును (Junnu) తయారు చేస్తూ ఉంటారు కొందరు. వాస్తవానికి జున్నులో పాల కంటే అధిక మోతాదులో పోషక విలువలు ఉన్నాయి. ఇక జున్నుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు క్రమం తప్పకుండా మిరే తింటారు. నిజానికి జున్ను పాలలో (Cheese in milk) ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు (Protein, calcium, vitamins, minerals)ఎక్కువగా లభిస్తాయి. జున్నులోని ప్రోటీన్ కండరాల నిర్మాణానికి , నిర్వహణకు ఎంతో సహాయ పడుతుంది. అలాగే బక్కగా, సన్నగా ఉండే వారు జున్ను తింటుంటే వళ్లు చేస్తారని చాలా మంది అభిప్రాయం.
అలాగే జున్నులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి, జున్ను తింటే జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది. జున్నులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీనితో ఎముకలు, దంతాల బలానికి (Strength of bones and teeth)ఎంతో దోహదపడుతుంది.నిజానికి కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జున్నులో విటమిన్లు A, B12 , కే కూడా బాగా లభిస్తాయి. ఖనిజాలలో పొటాషియం, మెగ్నీషియం, జింక్ కలిగి ఉంటాయి. అంతే కాకుండా తరచూగా జున్ను తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బాగా పెంచుతుంది. అలాగే రక్తపోటును తాగించడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తరచూ జున్ను తినేవారిలో మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. అలాగే జున్నులో సమృద్ధిగా లభించే ఫైబర్ (fiber)జీర్ణ వ్యవస్థ పనితీరును, మెరుగుపరికి మలబద్దకం, అజీర్తి సమస్యలను తొలగిస్తుంది.
జున్నులో కొంత కొవ్వు, క్యాలరీలు (Fat and calories)ఉంటాయి. ఇది ఇలా ఉంటె మరికొందరు జున్నును ఎక్కువగా తినడం మంచిది కాదు అని అంటారు . ఇక గర్భిణి స్త్రీలు జున్నులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే మాత్రం శిశువు ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది. అలాగే తల్లిపాలు సరిగాపడని బాలింతలు జున్ను తింటే మంచిది. ఇక జున్ను చర్మం సౌందర్యం కోసం ప్రయతించే వారు జున్ను తీసుకోవడం ద్వారా వారి అందం రెట్టింపు అవుతుంది. ఇక జున్ను మరీ ఎక్కువగా తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే ఏదైనా ఆహారం మోతాదుకు మించి తినకూడదు అనే మాట జున్నుకు వర్తిస్తుంది. అలాగే మితిమీరి జున్ను తింటే అది హృదయ సంబంధ వ్యాధుల (Cardiovascular diseases) భారిన పడే అవకాశం ఉంది.