Bike Tips : ప్రస్తుతం పలు చోట్ల వర్షాకాలం ప్రారంభం కావడంతో జోరుగా వానలు (rains) బాగా ఉన్నాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో అందరికి హాయిగా ఉంటోంది. అయితే వాతావరణం మారడంతో ప్రజల ఆరోగ్యంలో కొన్ని మార్పులు కూడా వస్తున్నాయి. జ్వరాలు, జలుబు తదితర అనారోగ్యాలు వాస్తు ఉన్నాయి. ఇక ఈ అనారోగ్యాల నుంచి రక్షణకు అనేక జాగ్రత్తలు మనం పాటించాలి. అలాగే మనం వాడే ద్విచక్ర వాహనాలు కూడా వానల వల్ల పాడవుతాయి. వానాకాలంలో ద్విచక్ర వాహనాల (Two-wheelers) విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే మనం సురక్షితంగా ప్రయాణించడానికి, వాహనం సక్రమంగా పనిచేయడానికి జాగ్రత్తులు తప్పనిసరి. రోడ్లపై ప్రయాణించేటప్పుడు వాహనం పట్టు తప్పి పడిపోకుండా, ఎక్కడ బడితే అక్కడ ఆగిపోకుండా ఉండాలంటే కొన్ని విషయాలను ఎప్పటి కప్పుడు మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి.ఈ వర్షాకాలం లో వాటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం అనే చెప్పాలి.. అవి ఏమిటంటే..
ముందుగా వాహనం రోడ్డుపై (road) సక్రమంగా ప్రయాణించాలంటే దానికి తగినంత పట్టు చాలా అవసరం అని అందరికి తెలిసిన విషయమే. ఒక వేల మీ వాహనం టైర్లు అరిగిపోయి ఉంటే వెంటనే మార్చుకోవడం మంచిది. ఎందుకంటే టైర్ల వల్ల అరిగి పోవడం వల్ల వర్షాకాలంలో రోడ్డపై జారిపడే అవకాశలుచాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే గుంతలలో బండి దిగితే టైర్ కు (tair) రాళ్లు గుచ్చుకుని పంక్చర్ అయ్యే ప్రమాదం కూడా ఎక్కువే.
వార్షాలు కురిసినప్పుడు బ్రేక్ ల పనితీరుపై తీవ్ర ప్రభావం బాగా పడుతుంది. కాబట్టి బ్రేక్ (break) నొక్కిన వెంటనే ముందు, వెనుక టైర్లు ఆగేలా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ బ్రేక్ సరిగ్గా లేకపోతె దానిని అవసరమైన మరమ్మతులు చేయించాలి. అలాగే వర్షంలో ఎక్కువగా తిరిగితే చైన్ లోని లూబ్రికేషన్ పోతుంది. దానివల్ల తుప్పు పట్టడంతో పాటు పనితీరు కూడా చాలా స్లో గా ఉంటుంది. కాబట్టి యాంటీ వాటర్ చైన్ లూబ్రికెంట్ (Chain lubricant)ను ఉపయోగించడం చాలా మంచిది.
బైక్ నిర్వహణ సక్రమంగా ఉన్నప్పటికీ మనం ప్రయాణించే విధానం కూడా చాలా ప్రమాదాల నివారణకు సాధ్యపడుతుంది. ముఖ్యంగా తడి పరిస్థితులలో పరిమిత వేగంతోనే వెళ్లాలి. అధిక వేగంతో (speed) వెళితే రోడ్లపై టైర్లు జారిపోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఎవరైనా సడెన్ గా అడ్డవస్తే బ్రేక్ వేసినప్పుడు బండి బోల్తా పడే అవకాశలు కూడా ఎక్కువే. అలాగే మలుపులు తిరుగుతున్నప్పుడు, రోడ్డుపై బురద ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా వెళ్ళాలి.
వార్షాలు ( rains) కురిసినప్పుడు ఇతర వాహనాల వెనుక వెళుతున్నప్పుడు తగినంత దూరం కూడా పాటించాలి. లేకపోతె తడి రోడ్లపై బ్రేక్ వేసినప్పుడు బండి ముందుకు జారీ పడిపోయే అవకాశం ఉంది. వర్షంలో రాకపోకలు సాగించిన తర్వాత మోటారుసైకిల్ కు బురద, మట్టి అంటుకుంటుంది. దానిని రోజు కూడా బైక్ ను నీటుగా కడిగేయాలి. ఇక చేయకపోతే పెయింట్, ఇతర సున్నితమైన భాగాలు దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా చైన్, బ్రేక్‌లు, ఎలక్ట్రికల్ భాగాలపై (Chain, brakes, electrical components) ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.