Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Birth certificate is the only one: ఇక జనన ధృవీకరణ పత్రం ఒక్కటేనంట 

-- అక్టోబర్‌ 1 నుంచి అమలు చేయనున్న కేంద్రం -- చట్టం అమలు తేదీ లేదంటే ఆ తర్వాతనుంచి వర్తింపు

ఇక జనన ధృవీకరణ పత్రం ఒక్కటేనంట 

— అక్టోబర్‌ 1 నుంచి అమలు చేయనున్న కేంద్రం

— చట్టం అమలు తేదీ లేదంటే ఆ తర్వాతనుంచి వర్తింపు

ప్రజా దీవెన/ న్యూ ఢిల్లీ: దేశంలో సంస్కరణలకు శ్రీకారం చుడుతోన్న కేంద్ర ప్రభుత్వం మరో సరికొత్త విధానానికి రూపకల్పన (The central government is designing another new policy) చేసింది. కేoద్రం తీసుకొచ్చిన జనన మరణాల నమోదు చట్టం 2023 అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్న కేంద్రం నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది.

ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు, విద్యా సంస్థల్లో ప్రవేశాలతో పాటు పాస్‌పోర్ట్‌, వివాహాల నమోదుకు ఇకపై బర్త్‌ సర్టిఫికెట్‌ ఒక్కటే( Aadhaar card, application for driving license, admissions to educational institutions, passport, marriage registration are now only birth certificates) అందిస్తే సరిపోతుంది. ఆగస్టులో జరిగిన వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఆగస్టు 11న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది.

అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ లేదంటే ఆ తర్వాత జన్మించిన వారికి బర్త్‌ సర్టిఫికెట్‌ను సింగిల్‌ డాక్యుమెంట్‌గా వినియోగించుకోవడానికి వీలు ఉంటుంది. పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశానికి సంబంధించి ఇలా వేర్వేరు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదని కేంద్రం తెలిపింది.

విద్యా సంస్థల్లో ప్రవేశం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ, ఓటరు నమోదు, వివాహాల రిజిస్ట్రేషన్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక ప్రభుత్వాల ఉద్యోగ నియామకాలకూ ఈ బర్త్‌ సర్టిఫికెట్‌ను సింగిల్‌ డాక్యుమెంట్‌గా వినియోగించుకోవచ్చని( Can be used as a single document) కేంద్రం నోటిఫికేషన్‌లో తెలిపింది.

జనన, మరణాలకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో డేటా బేస్‌ ఏర్పాటు చేసుకోవడానికి వీలు పడుతుందని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ సేవలు, సామాజిక పథకాలు, డిజిటల్‌ రిజిస్ట్రేషన్ల విషయంలో పారదర్శకతకు వీలు పడుతుందని తెలిపింది.

ఆధార్‌తో పాటు ఇతర పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా ప్రజల సౌకర్యాన్ని మెరుగుపర్చడానికి పుట్టిన తేదీ, ప్రదేశాన్ని వివరాలను ఒకే పత్రంలో సమర్పించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తోందని కేంద్రం చెబుతోంది. దత్తత తీసుకున్న, అనాథ, తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులు, సరోగేట్‌ పిల్లల నమోదు ప్రక్రియను ఈ చట్టం సులభతరం చేస్తుందని కేంద్రం తెలిపింది.