Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Black Heads: ముఖం మీద మచ్చలు, బ్లాక్‌హెడ్స్‌ పోగొట్టే టిప్స్ ఇవే …

Black Heads: ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు కూడా అందంగాఉండే కొరకు అనేక జాగ్రత్తలు తీసుకుంటే ఉంటారు.. ఇందులో చాలా మందిని ముక్కు, చెంపలు, గడ్డం మీద బ్లాక్ హెడ్స్ (Black Heads)బాగా ఇబ్బంది పెడతాయి. మెయిన్ గా చర్మ రంధ్రాలలో మురికి చేరడం వల్ల బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. ఈ బ్లాక్‌హెడ్స్‌ను (Black Heads) పోగొట్టుకోవడానికి చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ఇందుకొరకు మార్కెట్లో (market) కూడా అనేక కెమికల్‌ ఆధారిత ఉత్పత్తులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలోని కెమికల్స్ వల్ల చాలా చర్మ సమస్యలను (Skin problems) ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ బ్లాక్‌హెడ్స్ ను పోగొట్టుకోవడానికి ఇంట్లో ఉండే పదార్థాలతో ఈజీగా పోగొట్టుకోవచ్చు అవేంటో చూద్దమా..

మనం నిత్యం వాడే చక్కెరతో స్క్రబ్ (scrub) చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ చాలా ఈజీగా తొలగిపోతాయి.ఇందుకు ముందుగా మనం కట్ చేసిన నిమ్మకాయపై కొంచెం చక్కెరను (sugar) చల్లుకుని ముఖంపై స్మూత్‌గా మర్ధనా చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే, త్వరలోనే మనకి మంచి మార్పు వస్తుంది.అలాగే ఉప్పు బ్లాక్‌హెడ్స్‌ను (Black Heads) తొలగించడానికి ఒక మంచి పదార్థమే అనే చెప్పాలి. ఇక ఉప్పు(salt) బ్లీచింగ్ ప్రభావం బ్లాక్ హెడ్స్ తొలగించడంలో బాగా సహాయపడుతుంది. ఇందుకు ముందుగా ఉప్పుతో పాటు నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఎందుకంటే నిమ్మకాయలో కూడా బ్లీచింగ్ ప్రభావం ఉంటుంది కనుక. అనంతరం నిమ్మరసంలో కాస్త ఉప్పు మిక్స్ చేసి బ్లాక్ హెడ్స్ పై అప్లై చేయాలి. దింతో బ్లాక్ హెడ్స్ ను రిమూవ్ చేసుకోవచ్చు.

బొప్పాయి, పాలపొడి, నిమ్మరసం, బియ్యప్పిండి Papaya, milk powder, lemon juice, rice flour) కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి అప్ప్లైచేయాలి అనంతరం సున్నితంగా స్క్రబ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి దీనితో కాస్త బ్లాక్ హెడ్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే ఒక అరటిపండు గుజ్జు , రెండు చెంచాల గ్రౌండ్ ఓట్స్, ఒక చెంచా తేనె తీసుకోని వాటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అనంతరం 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. కొబ్బరి నూనెతో (cocunt oil)టీస్పూన్ పసుపును కలిపి పేస్ట్ లా చేసుకొని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా క్రమం తప్పకుండ చేసుకుంటే అతి సులువుగా బ్లాక్ హెడ్స్ (black heads) సమస్య నుంచి బయట పడవచ్చు.