Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Black Milk:నల్లటి పాల గురించి మీకు తెలుసా..?

Black Milk:మన రోజువారీ వినియోగంలో పాలు (milk)తప్పనిసరిగా ఉంటుంది. ఎక్కువగా ఆవు పాలు, గేదె పాలను ప్రత్యేకంగా ఇంటి అవసరాలు కాఫీ,టీ, పెరుగు కోసం పాలను ఉపయీగిస్తూ ఉంటారు. అలాగే పిల్లలు, పెద్దలు రోజూ పాలుతాగుతుంటారు. ఇక మరికొందరు మేక పాలను కూడా వాడుతారు. అయితే, ఈ పాలన్నీ తెల్లగా స్వచ్ఛగా ఉంటాయని మనందరికీ తెలిసిందే. కానీ, ఒక జంతువు పాలు నల్లగా ఉంటాయని మీకు ఏమైనా తెలుసా..? అవును, చాలా జంతువుల పాలు తెల్లగా (white milk) ఉంటాయి, కానీ, పాలు నల్లగా ఉండే జంతువు ఏమిటో తెలుసా?

నిజానికి ఆరోగ్యకరమైన జీవితానికి మంచి ఆహారపు (good) అలవాట్లు ఎంత ముఖ్యమో. అదే విధంగా పిల్లల పోషణకు పాలు అత్యంత ముఖ్యమైనవి. దాదాపు పిల్లలందరికీ ఎక్కువగా తల్లిపాలనే పడుతుంటారు. కానీ, కొందరు పిల్లలకు ఆవుపాలు, గేదె పాలు తాగిస్తు ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ఇక పిల్లలతో పాటు పెద్దలు, మహిళలు (Adults and women) కూడా పాలు తాగాలని వైద్యులు తెలుపుతూ ఉంటారు. కానీ, పాల రంగు విషయానికి వస్తే చాలా మంది పాల రంగు తెలుపు అని చెబుతారు. ఇది కాకుండా మీరు లేత పసుపు రంగు పాలను కూడా చూసి ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా నలుపు రంగు పాలను చూశారా..? బహుశ మీరు ఇలాంటివి చూసి ఉండకపోవచ్చు.

చాలా తక్కువ మంది మాత్రమే నల్ల పాలను చూసి ఉంటారు. అయితే, ఇలాంటి నలుపు రంగు పాలు ఆడ నల్ల ఖడ్గమృగం నుండి వస్తాయట. వాటిని ఆఫ్రికన్ బ్లాక్ ఖడ్గమృగం (Black Rhinoceros) అని కూడా పిలుస్తారు. ఖడ్గమృగం ఇచ్చే పాలు పూర్తిగా నల్లని రంగులో ఉంటాయి. వీటిలో కొవ్వు అస్సలు ఉండదని డాక్టర్లు చెబుతుంటారు. ఇవి ఆర్యోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు. శరీరానికి కావాల్సిన పోషకాలు, వీటి వల్ల పుష్కలంగా అందుతాయని డాక్టర్లు చెబుతారు. ఖడ్గమృగం తల్లి పాలలో నీరు ఉంటుంది. 0.2 శాతం కొవ్వు మాత్రమే ఉంటుంది. ఈ నల్లని పాలు (black milk)జంతువుల్లో పునరుత్పత్తి ప్రక్రియను నెమ్మదిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే నల్ల ఖడ్గమృగాలు నాలుగు నుండి ఐదు సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే పునరుత్పత్తి చేయగలవు. ఇది కాకుండా, వాటి గర్భం (pregnent) సాధారణం కంటే ఎక్కువ. ఇవి ఒక సంవత్సరం కంటే ఎక్కువ పాటు గర్భాన్ని మోస్తాయని పరిశోధకులు తెలియచేస్తున్నారు.