Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Brown Sugar: బ్రౌన్‌ షుగర్‌ వాడటం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

Brown Sugar: ప్రస్తుత రోజులలో బీపీ, షుగ‌ర్ (BP, Sugar) లాంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు ప్రతి ఒక్కరికి సర్వసాధారణమయ్యాయి. ఇలాంటి దీర్ఘకాలిక రోగాల బారినప‌డ‌కుండా ఉండాల‌న్నా మనం కొన్ని నియమాలు పాటించాలి .. ఇప్పటికే అలాంటి అరోగ్య సమస్యలు (Health problems) ఉన్నవాళ్లు వ్యాధిని అదుపులో పెట్టుకోవాల‌న్నా బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ లాంటివి ఎక్కువ‌గా తీసుకోవడం మంచిదని వైద్యులు తెలుపుతున్నారు. ఇక డాక్టర్లు (DOCTERS) చెప్పినట్లే చాలామంది కూడా జాగ్రత్తలు పాటిస్తుంటారు. ఇది ఇలా ఉండగా.. మరోవైపు వైద్యులు బ్రౌన్ షుగ‌ర్‌ కూడా ఆరోగ్యానికి మంచిదని సలహా ఇస్తున్నారు. బ్రౌన్‌ షుగర్‌ (Brown Sugar)తీసుకోవడం వాళ్ళ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక ఆ ప్రయోజనాలు ఏమిటంటే.. బ్రౌన్ షుగర్‌ను (Brown Sugar) చెరుకు నుంచి కాకుండా నేరుగా బెల్లం నుంచి సేకరిస్తారు. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు తెలుపుతున్నారు. వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ ‏లో అనేక పోషకాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. అంతేకాకుండా బ్రౌన్ షుగర్‌ లో పొటాషియం, జింక్, రాగి, భాస్వరం, విటమిన్ బి-6 వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోష‌కాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ, వైట్ షుగర్ తీసుకోవడంవ‌ల్ల కేలరీలు పెరుగుతాయని అంటారు. కానీ., వైట్ షుగర్ (WHITE SUGAR)తినడం వల్ల బరువు కూడా పెరిగే ప్రమాదం కూడా ఉంది.

అలాగే బ్రౌన్ షుగర్‌ (Brown Sugar) తో జీర్ణ సంబంధ సమస్యలు (Digestive problems) కూడా చాలా ఈజీగా తొల‌గిపోతాయి. దాంతో మలబద్దకం సమస్య కూడా మనకి తీరిపోతుంది. ఇందుకు కోసం ప్రతి రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అల్లం ముక్క, ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ (Brown Sugar) కలిపి తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇక అంతేకాకుండా శరీరంలో తిమ్మిర్లను తగ్గించడానికి కూడా బ్రౌన్ షుగర్ బాగా సహాయపడుతుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది కనుక కాళ్లు, చేతుల్లో తిమ్మిరితోపాటు నొప్పిని కూడా సులువుగా తగ్గిస్తుంది. ఇక బ్రౌన్ షుగర్‌ లో కేల‌రీలు (Calories) కూడా త‌క్కువ‌గా ఉండడంతో బరువు తగ్గడానికి బాగా తోడ్పడుతుంది. అంతేకాకుండా జీవక్రియల‌ను మెరుగుపరుస్తుంది. బ్రౌన్ షుగ‌ర్‌లో విటమిన్ బి6, నియాసిన్, పాంతోటెనిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలు కూడా బాగా ఉంటాయి. ఇవి చర్మం కోసం యాంటీ ఏజింగ్ కాంపోనెంట్‏గా గా ఉపయోగపడుతాయి. చర్మంపై మృత కణాలను తొలగించే స్క్రబ్‏గా కూడా వాడుతారు కొంత మంది.

బ్రౌన్ షుగర్ (Brown Sugar) యాంటీ అలర్జీ లక్షణాలను కూడా కలిగి ఉండడంతో ఇది ఉబ్బసం రోగులకు (For asthma patients) చేసే చికిత్సలో బాగా ఉపయోగిస్తారు. అదేవిధంగా బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేట‌రీ, యాంటీ బ్యాక్టీరియల్ ల‌క్షణాలను కూడా బ్రౌన్‌ షుగర్‌ కలిగి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నిత్యం బ్రౌన్‌ షుగర్‌ తీసుకోని అనారోగ్యానికి గురి కాకుండా ఉండండి.