CANCER AI TOOL: క్యాన్సర్‌ను గ్రహించే సరికొత్త AI పరికరం పని తీరు ఇదే..
CANCER AI TOOL: ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు క్యాన్సర్ (CANCER ) బారిన పడడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే క్యాన్సర్‌ను (CANCER) ఎంత త్వరగా గుర్తిస్తే.. అంత త్వరగా దాని నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను డెవలప్ చేసి.. వ్యాధిని ముందే పసిగట్టే ప్రక్రియపై ప్రయత్నాలు కొనసాగుతూన్నాయి. ఇప్పటికే బోస్టన్ లోని నార్త్ఈ స్టర్న్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ప్రొస్టేట్ క్యాన్సర్ ను కచ్చితంగా నిర్ధరించే ఏఐ టూల్ ను కనిపెట్టారు. అలాగే బయో ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సయీద్ అమల్ (Professor Saeed Amal of Bioengineering) నేతృత్వంలో రొమ్ము క్యాన్సర్ ను త్వరగా గుర్తించగలిగే మరొక ఏటీ టూల్‌ను రూపొందించారు. ఇది 99.78 % కచ్చితమైన సమాచారాన్ని ఇస్తుందని, దాని వల్ల రోగి.. వ్యాధిని ముదరక ముందే చికిత్స పొందవచ్చని పరిశోధకులు తెలుపుతున్నారు.
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ (American Cancer Society లెక్కల ఆధారంగా ప్రతి సంవత్సరానికి 30% వరకు రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. 2024లో రొమ్ము క్యాన్సర్ వల్ల 42,500 మంది మహిళలు చనిపోయే ప్రమాదం కూడా ఉందంట. ఈ వ్యాధి బాగా ముదిరిపోవడం వల్ల మరణాల సంఖ్య ఎక్కువ అవ్వచ్చని, క్యాన్సర్‌ను ముందే గుర్తించాల్సిన టెక్నాలజీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు (Medical professionals) స్పష్టం తెలుపుతున్నారు. ఈ సరికొత్త ఏఐ టూల్ (AI TOOL)ఈ సమస్యను పరిష్కరించగలదని వారు అంచనా వేస్తున్నారు.
ఇక మరొక వైపు కొత్త ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్నిడాక్టర్లు (DOCTERS) రకరకాల క్యాన్సర్ల నిర్ధారణలో ఉపయోగించవచ్చు. ఈ కొత్త పరిజ్ఞానం డిజిటల్ పాథాలజీ రంగంలో విప్లవాత్మకమైందిగా అని అన్నారు. ఈ సందర్బంగా ప్రొఫెసర్ సయీద్ అమల్ మాట్లాడుతూ.. ఈ ఏఐ టూల్ అత్యధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలను పరిశీలించి.. క్యాన్సర్ లక్షణాలను కనిపెతుందని తెలిపారు. అంతే కాకుండా.. హిస్టరికల్ డేటాను ఉపయోగించి రోగ నిర్ధారణ ఎలా చెయ్యాలో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్థుందని అన్నారు. ఈ ఏఐ బయాప్సీలో ట్యూమర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చెయ్యదు. 10, 20 డయాగ్నోసిస్‌లు (Diagnoses) చేసిన తర్వాత కూడా అలసిపోదు. కనుక నిర్ధారణలో ఖచ్చితత్వం సాధ్యపడుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా ఖచ్చితంగా సమస్యను గుర్తించేందుకు, మరింత త్వరగా చికిత్స ప్రారంభించేందుకు ఈ ఏఐ టూల్ బాగా ఉపయోగపడుతుందని అంచనా. అలాగే టూల్ ఉపయోగించి వ్యాధిని నిర్ధారణ చెయ్యడమంటే.. ఒకరి కంటె ఎక్కువ మంది డాక్టర్ల అభిప్రాయాలు తీసుకోవడంతో సమానమని ఆయన అన్నారు. ఏదిఏమైనా ఈ టూల్ ను ఉపయాగించి వ్యాధిని నయం చేసుకోవడం మంచిదే కదా.