CANCER:ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌తో (CANCER) పోరాడే వారి సంఖ్య రోజురోజుకూ బాగా పెరిగి పోతుంది. మన శరీరంలో క్యాన్సర్ లాస్ట్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే మాత్రమే బయట పడుతుంది. దీంతో చాలా మంది క్యాన్సర్ బారిన పడి కూడా మరణచినా వారు చాల మందే ఉన్నారు. ఈ క్రమంలోనే క్యాన్సర్(CANCER) నివారణ, క్యాన్సర్‌ను ప్రభావితం చేసే అంశాలపై పరిశోధకులు పలు పరిశోధనలు కూడా జరుగుతాయి. ఇది ఇలా ఉండగా ఈ పరిశోధనల్లో క్యాన్సర్‌ను నయం చేసే విధానాల గురించి చాలా విషయాలు బయట పడుతున్నాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపవాసం విషయం కూడా చర్చకు రావడం విశేషం.
ఇక ఉపవాసం చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్‌ను (Cancer risk)తగ్గిస్తున్నట్లు తెలుపుతున్నారు. ఉపవాసం అనేది.. ఒక నేచురల్ కిల్లర్‌లా కణాల మీద పని చేస్తుందని పరిశోధకులు తెలియచేసారు. ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బలేపేతం కూడా చేయవచ్చట . అలాగే ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడటంతో క్యాన్సర్ కణాలు నశిస్తున్నట్లు వెల్లడించారు. సాధారణంగా క్యాన్సర్‌కు కీమో థెరపీ కూడా చేస్తారు. ఈ మందులు వల్ల హానికరమైన దుష్ప్రభావాలు ఉంటాయి. కాబట్టి ఉపవాసం (fasting) ఉండటం వల్ల ఆరోగ్యకరమైన కణాలను రక్షించగలదని.. 2012లో ఎలుకల మీద చేసిన ప్రయోగాల్లో తేలినట్లు సమాచారం.
ఇటీవల జర్మన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ (German Cancer Research Center) చేసిన అధ్యయనంలో అప్పుడప్పుడూ ఉపవాసాలు చేయడం వల్ల కాలేయం, క్యాన్సర్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో కనుకోవడం మొదలు పెట్టారు. వారంలో ఐదు రోజుల పాటు క్రమంగా తిని.. రెండు రోజుల పాటు ఉపవాసం చేయడం వల్ల కాలేయ క్యాన్సర్ ప్రమాదం నివారించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు
అంతేకాకుండా ఉపవాసం ఉండటం వల్ల క్యాన్సర్ కణాలపై (on cancer cells) కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ ల్లో ఉంచుకోవచ్చు. ఉపవాసం చేయడం వల్ల శరీరంలో ఉండే చెడిపోయిన కాలు శరీరం నుంచి బయటకు కూడా పంపందుకు సహాయ పడుతుంది . ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ కణాలు ముదరక ముందే ఈ కణాలను నాశనం కూడా చేస్తుంది అంట. అయితే ఉపవాసం చేయాలా? వద్దా? అన్నది మాత్రం కచ్చితంగా వైద్యుల (docters) సలహా తీసుకోవడం మంచిది. ఇందుకు గల కారణం ఏమిటంటే.. ఒక్కొరి శరీరం ఒక్కోలా ఉండడమే.