Cancer:ప్రస్తుతం మన దేశంలో క్యాన్సర్ (cancer) కేసులు బాగా వేగంగా నమోదు అవుతున్నాయి. ఇక పట్టణ ప్రాంతాల్లో ఉండే వారి పరిస్థితి అయితే మరి దారుణంగా ఉంది. అయితే క్యాన్సర్ (cancer) వ్యాధి విషయంలో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే., ఈ వ్యాధి మొదటిలో లక్షణాలను ప్రజలకు అసలు అర్థం కాదు. ఈ కారణంగా వ్యాధి చాలా ఆలస్యంగా నిర్ధారణ అయ్యేలోపు శరీరంలో క్యాన్సర్ వ్యాపించిపోయి ఉంటుంది. ఇక ఇలాంటి వ్యాధులలో బారిన పడకుండా ఉండాలంటే ముందుగా మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో ఏ ఆహారాలు శరీరంలో క్యాన్సర్ ((cancer)) ప్రమాదాన్ని పెంచుతాయనే విషయాన్ని తెలుసుకుందాం..
ప్రముఖ సీకే బిర్లా హాస్పిటల్ ఆంకాలజీ సర్వీసెస్ (CK Birla Hospital Oncology Services) డైరెక్టర్ డాక్టర్ అయిన నీరజ్ గోయల్ తెలిపిన ప్రకారం.. క్యాన్సర్ (cancer) బారిన పడకుండా ఉండాలంటే డైట్‌పై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం అని తెలిపారు. ఎందుకు అంటే శరీరంలో క్యాన్సర్ (cancer)ప్రమాదాన్నిపెంచే కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఇక వాటిని తినకపోతే, క్యాన్సర్ కు గురి అవ్వకుండా జాగ్రత్తగా ఉండచ్చు. అంతేకాదు కేవలం ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాదు. ఈ వ్యాధి జన్యుపరమైన, పేలవమైన జీవనశైలి, పర్యావరణం వల్ల కూడా రావచ్చని అన్నారు. ఎలాంటి ఆహారం మనం దూరంగా ఉండాలంటే.. ముందుగా ప్రాసెస్ చేసిన మాంసంతో క్యాన్సర్ ముప్పు ఎక్కువ అని డాక్టర్ నీరజ్ గోయల్ (Dr. Neeraj Goyal)అంటున్నారు. ప్రాసెస్ చేయబడిన మాంసాలలో నైట్రేట్లను కలిగి ఉంటాయి. ఇవి నైట్రోసమైన్లు అని పిలిచే క్యాన్సర్ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. అందుకే వీటికి దూరంగా ఉండడం మంచిది. ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినడం పెద్దప్రేగు క్యాన్సర్ భారిన పడే అవాకాశాలు ఎక్కువగా ఉన్నాయట.
ఇక మరొక ఆహార పదార్థనికి వస్తే.. ఎర్ర మాంసాన్ని(Red meat) అధికంగా తీసుకోవడం, ప్రత్యేకించి అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పుడు, హెటెరోసైక్లిక్ అమైన్‌లు (HCAs) మరియు హైడ్రోకార్బన్‌లు (PAHs) వంటి క్యాన్సర్ కు దారి తీస్తాయి. దీని వాళ్ళ పెద్దప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాకుండా రెడ్ మీట్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే అది కాలేయ క్యాన్సర్ రావచ్చు. అలాగే అధిక ఉష్ణోగ్రతల వద్ద మాంసాన్ని కాల్చడం వల్ల HCAలు, PAHలు ఉత్పత్తి అవుతాయి. దీనితో క్యాన్సర్ రావొచ్చు. ఇలాంటి పరిస్థితిలో మీరు అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం మానుకోవడం మంచిది. ఇంకెందుకు మీరు కూడా పైన తెలిపిన ఆహార పదార్థాలు దూరంగా ఉంటె కాన్సర్ భారిన పడకుండా ఉండండి.