Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Curry leaves juice: నిత్యం కరివేపాకు రసం చూసి తాగుతే ఏమవుతుందో తెలుసా

Curry leaves juice: ప్రస్తుత ఊరుకు పరుగు బిజీ లైఫ్ లలో అనేక మంది ఊబకాయం (obesity) సమస్యతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బాగా బాధపడుతున్న సమస్య కూడా ఇదే అని చాలా పరిశోధనలో తెలిసింది. దీనివల్ల అధిక కొలెస్ట్రాల్ (High cholesterol), బీపీ, మధుమేహం, గుండెపోటు (BP, diabetes, heart attack) లాంటి ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే.. మీరు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం తప్పదని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. ఈ ఆహార మార్పులు కావాల్సిన వస్తువులు అన్నీ కూడా మన వంటింట్లోనే ఉండి సహజ పదార్థాలతోనే మనకు చాలా మేలును కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు (Health professionals) తెలుపుతున్నారు. అధిక బరువు సమస్య నుంచి బయటపడాలి అంటే కరివేపాకు ముఖ్యపాత్ర వహిస్తుందని మీకు తెలుసా.. అయితే దాని విశేషాలేంటో ఓ సారి చూద్దాం..

సాధారణంగా కరివేపాకు (Curry leaves) ద్వారా బరువు తగ్గడం (WEIGHT DECREASE) చాలా ఈజీ. ప్రతి ఒక్కరు కూడా వివిధ వంటకాలలో కరివేపాకును సువాసన కోసం వాడుతూ ఉంటారు. మరికొందరు ఈ కరివేపాకుతో చట్నీ, పొడిని కూడా చేసుకొని ఆహారంగా సేవిస్తారు. కేవలం ఇలా కరివేపాకును (Curry leaves) ఉపయోగించడం ద్వారా ఆరోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది. ఊబకాయాన్ని తగ్గించడంలో కరివేపాకు చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఐరన్, కాల్షియం, భాస్వరం, విటమిన్ C ఇలా అనేక ముఖ్య పోషకాలు లభిస్తాయి. చాలామందికి మొదట పొట్ట, నడుము చుట్టూ కొవ్వు బాగా పేరుకొనిపోతుంది. ఇలాంటి సమయంలో కరివేపాకును తీసుకోవడంతో చాలా సులువుగా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.

ఇక కరివేపాకు రసం (Curry leaves JUICE) తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ (Cholesterol, Triglyceride) స్థాయిలు కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా కరివేపాకు రసం తాగడం వల్ల రక్తంలో ఉండే చక్కర స్థాయిని కూడా అదుపులోకి చేసుకోవచ్చు. ఇక ఈ కరివేపాకు రసం తయారు చేయడానికి మనం ముందుగా కరివేపాకును కడిగి నీటిలో బాగా ఉడక పెట్టాలి. అనంతరం ఆ నీటిని ఫిల్టర్ సహాయంతో వడపోసి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తాగాలి. అలాగే ఈ కరివేపాకును మరో పద్ధతిలో కరివేపాకు ఆకులను చూర్ణంగా చేసి నిమ్మకాయ రసం (LEMON JUICE) లేదా తేనెతో (HONEY) కలిపి తీసుకుంటే కూడా అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు.