Dangerous Animals in World: మన భూమిపై చాల ప్రమాదకరమైన జీవులు ఏమిటంటే మనకి ముందుగా గుర్తు వచ్చేది.. అడవి సింహాలు, విష సర్పాలు, సొరచేపలు లాంటి జంతువులే (animals)అనుకుంటాం. వాస్తవానికి జీవులను చాలా సినిమాలలో ప్రమాదకరమైనవిగా చూపించారు. కనుక ఇవి మానవులకు అత్యంత ప్రమాదకరమైనవిగా ప్రజల్లో నిలిచిపోయింది. కానీ, వీటి కంటే మనుషులకు హాని కలిగే ప్రమాదకరమని నిరూపించే కొన్ని జీవులు ఉన్నాయి అంటే నమ్మండి… అవి కూడా చాలా పెద్దవిగా ఉంటాయని మీరు అనుకుంటారేమో కాదు అవి పరిమాణంలో చాలా చిన్నవిగా (small) ఉంటాయి. కానీ అవి మనుసుల ప్రాణాలను అత్యంత సులువుగా వారి ప్రాణాలను తీయగలవు. అలంటి జీవులు కూడా ప్రతి సంవత్సరం మిలియన్ల మరణాలకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. అవి ఏమిటంటే ..
నిజానికి దోమలు మనుషులకు ఎంత ప్రమాదకరమో తెలుసా? ఎందుకంటే ప్రమాదకరమైన జీవులలో దోమలు అగ్రస్థానంలో ఉంటాయి. చూడడానికి దోమలు చిన్నవిగా కనిపించినా ప్రాణాంతకమైన వ్యాధులను వ్యాప్తి చెండంతో ముందు వరుసలో ఉంటాయి. భూమిపై ఉన్న ఏ జీవితో పోల్చినప్పటికీ మనిషి మరణానికి దోమలే (Mosquitoes) ప్రధాన కారణమని డాక్టర్లు కూడా అంటున్నారు.. ఇలా మనుషులను దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, జికా వైరస్, టైఫాయిడ్ (Dengue, Malaria, Zika Virus, Typhoid) జ్వరం వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తాయి. దోమల వల్ల వ్యాపించే వ్యాధులతో ఏటా 7 లక్షల మంది మృతి చెందుతున్నాయి అని సర్వేస్ తెలుపుతున్నాయి.
అలాగే వాస్తవానికి మనిషికి మానవుడే అతిపెద్ద ముప్పు. దొంగతనం, దారిదోపిడీ, గొడవలు, హత్య, అఘాయిత్యాలు లాంటి నేరాలకు కారణంగా మానవుడే. మనుషులే ఇతర మానవులను క్రూరంగా చంపుతున్నా సంఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అలాగే ఈ జాబితాలో పాములు చాలా ప్రమాదకరమైన జీవులు. పాములు మనుషుల ప్రాణాలను సులువుగా తీస్తాయి. పాము కాటు వల్ల ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా మరణిస్తున్నారని సర్వేస్ తెలుపుతున్నాయి. . పాములంటే మనుషులు భయపడటానికి కారణం ఏమిటంటే. ఇన్లాండ్ తైపాన్, కింగ్ కోబ్రా, బ్లాక్ మాంబా (Inland Taipan, King Cobra, Black Mamba)వంటి పాము జాతుల విషం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తిని కాటు వేసిన కొన్ని గంటల్లోనే అతను చనిపోవచ్చు. కొండచిలువలు వంటి పాములు 10 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. మనిషిని సులభంగా మింగగలవు. ఇలాంటి ఘటనలు తరచూ మనం వార్తలలో చూస్తూనే ఉంటాం. కొండచిలువలు ఎప్పుడూ మాటువేసి దాడి చేస్తాయి. వాటి రంగు కారణంగా అవంత సులభంగా కనిపించవు. ఇక ఈ లిస్ట్ లో కుక్కలు, నత్తలు,తేలు ఇలా చాలానే ఉన్నాయి. ఇలాంటి జీవులతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటె అంత మంచిది అనే చెప్పాలి.