Drinking beer…beaker full: బీరు తాగుతున్నారా…బీకేర్ ఫుల్
--బీర్ బాటిళ్లకు గడువు ఉంటుందని తెలుసుకోండి -- ఆరు మాసాలు దాటిన బీరుతాగితే అంతేసంగతులు
బీరు తాగుతున్నారా…బీకేర్ ఫుల్
–బీర్ బాటిళ్లకు గడువు ఉంటుందని తెలుసుకోండి
— ఆరు మాసాలు దాటిన బీరుతాగితే అంతేసంగతులు
ప్రజా దీవెన/హైదరాబాద్: చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆనందంగా ఆస్వాదించేది బీ అని అందరికీ తెలిసిందే. చాలా మంది ముఖ్యంగా దావత్ మూడ్‌లో ఉన్నప్పుడు బీర్, మద్యం లను మక్కువతో సేవిస్తుంటారు.
అయితే ఆ సందర్బంలో అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏ పార్టీ అయినా ముందుగా వైన్ షాప్‌కి వెళ్లి బీర్ కేస్ గానీ, మందుగానీ తీసుకువచ్చి దావత్ ప్రారంభిస్తుoటారు. అయితే నేరుగా తాగడo ప్రమాదకరం అని, మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా అనేది మదిని తోలుస్తుంది.
వెనక ముందు చూసుకోకుండా బీర్ తాగడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే బీర్ తాగే ముందు కొన్ని అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా పాత బీర్లు మొదటికే మోసాన్ని తెచ్చి పెడతాయి.
చాలా మంది ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండానే బీర్ తాగుతుంటారు. బీర్ బాటిళ్లకు గడువు తేదీ ఉంటుందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. కొన్ని ప్రదేశాలలో, విక్రేతలు తమ నిల్వలను క్లియర్ చేయడానికి పాత బీర్‌ను విక్రయిస్తారు. ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
మద్యం విక్రయదారులు కూడా గడువు తేదీతో బీర్ విక్రయించడానికి అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను ఇస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ తప్పకుండా బీరు గడువు తేదీని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం అవసరం. బీర్ గడువు ముగిసినట్లయితే అస్సలు తీసుకోకుండ దానిపై కంప్లైంట్ ఇవ్వవచ్చు.
వాస్తవానికి బీర్లో ఆల్కహాల్ కంటెంట్ 4 నుండి 8 శాతం వరకు ఉంటుంది. మిగిలిన భాగం బార్లీ, ఇతర రకాల నీటిని కలిగి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మద్యం కంటే ముందుగానే గడువు ముగుస్తుంది. సాధారణంగా బీర్ గడువు 6 నెలల్లో ముగుస్తుంది.
అందుకే 6 నెలల్లోపు మాత్రమే దీనిని తాగాలి. మీరు బీరును తెరిస్తే వెంటనే త్రాగాలి. కొన్ని గంటల తర్వాత దాని రుచి క్షీణిస్తుంది. అలాగే ఓపెన్ బీర్లో బ్యాక్టీరియా తదితరాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మీరు ఎప్పుడు పార్టీ పెట్టినా ఈ విషయాలను గుర్తుంచుకోండి.