Durva grass: వినాయకునికి పూజలో గరికను (Durva grass) సమర్పిస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. అలాగే ప్రముఖ గణపతి దేవాలయాల్లో గరికెను విరివిగా వాడుతారు. అయితే గరికతో ఆరోగ్య ప్రయోజనాల (health benefits) గురించి మీకు ఎవరికైనా తెలుసా? దీని వినియోగం వల్ల మనకు అనేక హెల్త్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఈ కలుపు మీ ఆరోగ్య సమస్యల(health benefits) నుంచి ఎలా బయట పడాలో చూద్దామా మరి…
మనలో ఎవరైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, దురద లేదా అలర్జీ (Urinary tract infection, itching or allergy) ఉంటే గరిక గడ్డిని కషాయం చేసి తాగితే వెంటనే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. గరిక రసాన్ని తీసి అందులో కాస్త నిమ్మరసం, మరికొంత తేనె కలుపుకుని క్రమం తప్పకుండా తీసుకుంటే మూత్రనాళానికి సంబంధించిన అన్ని రకాల సమస్యల నుంచు బయట పడవచ్చు.అలాగే తలనొప్పి, మైగ్రేన్ సమస్య ఉన్నవారు దీన్ని బాగా గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్‌లా (paste)చేసి అందులో కాస్త నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని మీ నుదుటిపై రాసుకుని కొంత సేపు హాయిగా పడుకోండి. తలనొప్పినుంచి చాలా త్వరగా రిలీఫ్ లభిస్తుంది.
ఇక గరిక గడ్డి రసంలో కొంచెం బెల్లం కలుపుకుని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పీసీఓడీ, రుతుక్రమ సమస్యలు, అధిక రక్తస్రావం వంటి సమస్యల నుంచి సులువుగా బయట పడవచ్చు. గరిక గడ్డి అజీర్ణం, కడుపు ఉబ్బరం, పులుపు, మలబద్ధకం (Indigestion, flatulence, belching, constipation) సమస్యతో సహా జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు ఒక దివ్యౌషధం అనే చెప్పాలి. గరిక శరీరం నుంచి మలినాలను తొలగిస్తుంది. రక్తం స్వచ్ఛంగా ఉండాలంటే గరికె గడ్డిని మీ డైట్‌లో భాగం చేసుకోండి. ఇక గరిక గడ్డి రసాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం మంచిది. ఇలా చేయడంతో రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.