EAR PAIN: ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు కూడా పాటలు వినడానికి, యూట్యూబ్ వీడియోస్, షాట్స్, సినిమాలు లాంటివి చూడడానికి ఇయర్ ఫోన్స్ ,ఇయర్ బర్డ్స్ (Ear phones, ear birds) ఉపయోగిస్తూ ఉన్నారు. ఇలా ఎక్కువ ఇయర్ ఫోన్స్ ఉపయోగించడం వల్ల చెవులలో నొప్పి, జలదరింపు ఏర్పడుతుంది. ఒకవేళ ఈ నొప్పిని (PAIN) మనం నిర్లక్ష్యం చేసినట్లయితే తీవ్రమైన వ్యాధికి లోనవ్వాల్సిందే.. ఇలాంటి సమయాల్లో తగిన చికిత్స తో పాటు జాగ్రత్తలు అవసరం అని నిపుణులు తెలియజేస్తున్నారు.
కొంతమందికి చాలా సార్లు చెవులలో (EARS) ఒక వింత శబ్దం నిరంతరం వినపడుతూనే ఉంటుంది. కానీ చుట్టుపక్కల వాతావరణంలో మాత్రం ఎటువంటి శబ్దం ఉండదు. ఒకవేళ మీ చెవులలో కూడా ఇలాంటి రకమైన శబ్దం వినపడితే అది టిన్నిటస్ (Tinnitus) కూడా అవ్వవచ్చు. ఈ వ్యాధికి కారణంతోనే చెవులలో ఒక రకమైన దగ్గరగా లేదా మృదువైన నిరంతరం సౌండ్ (SOUND)వస్తూ ఉంటుంది. దీంతో ఎక్కువగా తలనొప్పి ,చెవులలో జలదరింపు లాంటివి దారితీస్తాయి. ఇవి కేవలం టిన్నిటస్ వ్యాధికి ప్రారంభ సంకేతాలు మాత్రమే.
ఇదే విధంగా చెవులలో రింగింగ్ ఎక్కువ కాలం వినబడితే చెవులు దెబ్బ తినే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు (DOCTERS) తెలియజేస్తున్నారు. ఇక ఈ సమస్య అసలు ఎందుకు వస్తుంది అంటే.. చాలా సార్లు చెవిలో గుమిలి ఎక్కువ కాలం పాటు పేరుకు పోవడం కూడా ఒకటి. అలాగే చెవి ఇన్ఫెక్షన్, చీము ఉత్సర్గ, తీవ్రమైన గాయం (Ear infection, pus discharge, acute trauma) లేదా ఇన్ఫెక్షన్, చెవిపోటలో రావడం కూడా ఏర్పడే అవకాశం ఉండవచ్చు. ఈ సమస్య నుంచి బయట పడాలి అంటే ఎక్కువగా ఈ ఇయర్ బర్డ్స్ (EAR BURDS) ఉపయోగించకుండ తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఒకవేళ జాగ్రత్తలు పాటించకపోతే కచ్చితంగా చెవిపోటుకి హాని చేస్తుంది. ఇక చెవులో ఈ రింగింగ్ శబ్దానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటి అంటే.. అధిక రక్తపోటు, థైరాయిడ్ పెరగడం, మధుమేహం, రక్తహీనత కూడా ఇందుకు ఒక కారణాలు అని డాక్టర్స్ తెలియజేస్తున్నారు