Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fenugreek Leaves: మెంతి ఆకులను నమలడం వల్ల లాభాలు ఇవే ..!

Fenugreek Leaves: ప్రస్తుతం ఉండే రోజులలో ఎన్నో రకాల జబ్బులు వాస్తు ఉన్నాయి.. వాటి భారిన పడకుండా చాలా మంది అనేక ఆరోగ్య జాగ్రత్తలు (health care) తీసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో మనం మెంతి ఆకులు తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో చూదామా… ఉదయాన్నే మెంతి ఆకులను (Fenugreek Leaves) నమలడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. కొంతమంది మెంతి గింజలను తింటారు. మెంతి ఆకులను (Fenugreek Leaves) క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యకరమైన, శక్తివంతమైన జీవితాన్ని పొందవచ్చు.

వాస్తవానికి మెంతి ఆకు కూరల్లో విటమిన్లు ఎ, సి, ఇ, బి-కాంప్లెక్స్, కాల్షియం, పొటాషియం, ప్రొటీన్, ఫైబర్ (Vitamins A, C, E, B-complex, calcium, potassium, protein, fiber) పుష్కలంగా ఉన్నాయి. రెగ్యులర్ వినియోగంతో మన శరీరం పోషకాలను పొందుతుంది. మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ఇక మెంతి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరం వ్యాధులతో సరిగ్గా పోరాడగలదు.

ఈ మెంతి ఆకులను (Fenugreek Leaves)ఉదయాన్నే ఖాళీ కడుపుతో నమలడం వల్ల రక్తపోటు అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే ఈ ఆకులలో ఉండే పొటాషియం, మెగ్నీషియం (Potassium, magnesium)గుండె చప్పుడును అదుపులో ఉంచుతాయి. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే మెంతి ఆకుల్లో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణవ్యవస్థ కూడా బాగుంటుంది. ఇది మలబద్ధకం, ఇతర జీర్ణ సంబంధిత వ్యాధుల నుంచి సులువుగా బయట పడవచ్చు.ఈ మెంతి ఆకులో విటమిన్ ఎ, ఇ ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మం, జుట్టు (Skin and hair)ఆరోగ్యాన్నికూడా మెరుగుపరుస్తుంది. ఇది చర్మపు చికాకును కూడా బాగా తగ్గిస్తుంది.
మెంతి ఆకులు జీవక్రియను పెంచడంలతో పాటు బరువును అదుపులో ఉంచుతుంది.

మెంతి ఆకులను తీసుకోవడం వల్ల ఆకలి బాగా తగ్గుతుంది. శరీరంలో శక్తి పెరుగుతుంది. కుంకుమపువ్వు ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ ఆకులను నమలడం వల్ల అనేక ప్రయోజనం పొందుతారు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాల (Antioxidant properties) వల్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి బాగా సహాయపడుతుంది. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తు అనేక వ్యాధులు మన దరికి రాకుండా కాపాడుతుంది.