Flax seeds: ప్రస్తుత రోజులలో అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. దీనితో.. చాలా మందిలో ఆరోగ్య పట్ల అవగాహన కూడా బాగా పెరుగుతోంది.. ప్రజలు తమ ఆహారంలో ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకోవడం కూడా మొదలు పెట్టారు. అలాంటి పదార్థాలలో ఒకటి అవిసె గింజలు. ఈ చిన్న గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక అవిసె గింజలు ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలను (Fiber, omega-3 fatty acids, vitamins and minerals)పుష్కలంగా కలిగి ఉంటాయి. అలాగే అవిసె గింజలు తినడం వల్ల కలిగే 5 ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దామా
వాస్తవానికి అవిసె గింజల్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. అలాగే ఈ గింజలు మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కూడా కలిగిస్తాయి. అదనంగా, అవిసె గింజలు జీర్ణక్రియను (Digestion) మెరుగుపరిచే ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు (Fatty acid) పుష్కలంగా ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను కూడా పెంచుతాయి. అలాగే రక్తపోటును నియంత్రించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
అవిసె గింజల్లో అధిక మొత్తంలో ఫైబర్ (fiber) లభిస్తుంది. ఫైబర్ ఉండడంతో చాలా కాలం పాటు నిండుగా ఉంచుతుంది. దీనితో మీరు మళ్లీ మళ్లీ తినాలనే కోరికను అనుభవించరు.. ఇది బరువు తగ్గించడంలోకూడా సహాయపడుతుంది. అలాగే అవిసె గింజలు జీవక్రియను పెంచి కేలరీలను వేగంగా బర్న్ చేస్తాయి. ఇక ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు అవిసె గింజలలో ఉంటాయి.. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.. ముడతలు, ఫైన్ లైన్‌లను తగ్గించడంలో కూడా బాగా సహాయపడతాయి. ఇది కాకుండా, ఇది మొటిమలు, ఇతర చర్మ సంబంధిత సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని పొందవచ్చు .
మనం అవిసె గింజలను అనేక విధాలుగా మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. మనం వాటిని పెరుగు, సలాడ్, స్మూతీ (Yogurt, salad, smoothie)లేదా గంజిలో కలిపి తినవచ్చు. అలాగే నీటిలో నానబెట్టి కూడా తినవచ్చు.. ఇంకా వేయించి.. లేదా పచ్చిగా కూడా అవిసె గింజలను కూడా తినవచ్చు.