Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Google Map: గూగుల్‌ మ్యాప్స్‌తో ఏఐ ఫీచర్స్‌

Google Map: ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందుగా గూగుల్ మ్యాప్స్ వాడడం సర్వ సాధారణం అయిపొయింది. అయితే తాజాగా గూగుల్‌ మ్యాప్స్‌లో (Google Map)’న్యారో రోడ్‌’ (Narrow Road) అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టారు. ఈ ఫీచర్‌ ద్వారా శాటిలైట్‌ చిత్రాలు, స్ట్రీట్‌ వ్యూతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (Artificial intelligence) ఆధారంగా ఇరుకు రోడ్లను కూడా కనిపెటేస్తుంది. అంతే కాకుండా ఆ మార్గంలో ప్రయణిస్తున్న వారికీ ఇరుకు రోడ్లు ఉంటే వెంటనే న్యారో రోడ్‌ ఉందని అలర్ట్‌ కూడా వస్తుంది. ఈ అలర్ట్స్ తో మనం ఫోర్‌ వీలర్‌ ఉపయోగిస్తుంటే వెంటనే ఇతర మార్గాన్ని చూసుకోవడానికి సహాయ పడుతుంది.

ఇక సిటీస్ లో అయితే ఫ్లై ఓవర్‌ (Fly over) విషయంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవు తుంటాయి. సాధారణంగా మార్గ మధ్యంలో ఫ్లైఓవర్‌ వస్తే పైకి ఎక్కాలా.? కింది నుంచి వెళ్లాలా అనే సందేహం అందరికి వాస్తు ఉంటుంది . అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ ఈ కొత్త ఫీచర్‌ (new feature)పరిష్కరించింది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో ఫ్లైఓవర్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి.

అలాగే మార్గ మధ్యంలో ఫ్లైఓవర్‌ వస్తే వెంటనే యూజర్లను అలర్ట్‌ మెసేజ్ వస్తుంది. ఒకవేళ ఫ్లైఓవర్‌ పై నుంచి వెళ్లాల్సి ఉంటే. టేక్‌ ఫ్లై ఓవర్‌ అనే సూచిక ఇచిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ దేశంలోని 40 ప్రధాన నగరాల్లో అందుబాటులో కూడా ఉంది .

ఇక మ్యాప్స్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌ను (Interesting feature) తీసుకొచ్చారు. అది ఏమిటంటే మెట్రో టికెట్లను బుక్‌ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను కొచ్చి, చెన్నై మెట్రోలో (In Kochi and Chennai Metro) అందుబాటులోకి తీసుకొచ్చారు త్వరలోనే ఇతర నగరాల్లో కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇక మరొక వైపు ఎలక్ట్రిక్‌ వాహనాలను (Electric vehicles) ఉపయోగించే వారి కోసం గూగుల్ మ్యాప్స్‌లో (Google Map) కొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది. ఈ ఫీచర్‌ సహాయంతో మ్యాప్స్‌లో ఈవీ స్టేషన్స్‌ ఎక్కడ ఉన్నాయో సులువుగా తెలుసుకోవచ్చు. మ్యాప్స్‌లో ఛార్జింగ్ స్టేషన్స్‌తో పాటు, ఎలాంటి పోర్ట్స్‌ అందుబాటులో ఉంటాయన్న అన్ని వివరాలను కూడా తెలుసుకోవచ్చు.