Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

వారం రోజుల పాటు ఎం ఎం టి ఎస్ రైళ్లు రద్దు

హైదారాబాద్ వాసులకు ఇక్కట్లు

వారం రోజుల పాటు ఎం ఎం టి ఎస్ రైళ్లు రద్దు

హైదారాబాద్ వాసులకు ఇక్కట్లు

ప్రజా దీవెన/ హైదారాబాద్: హైదరాబాద్‌ వాసులకు రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. నగర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోన్న ఎంఎంటీఎస్‌ సేవలు వారం రోజుల పాటు నిలిచిపోనున్నాయి. ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు వారం రోజుల పాటు పలు సర్వీసులు నిలిచిపోనున్నాయి. నిర్వహణ పనుల నిమిత్తం సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.

ఇక రద్దు చేసిన రైళ్ల వివరాల విషయానికొస్తే.. లింగంపల్లి – హైదరాబాద్(47129), లింగంపల్లి – హైదరాబాద్ (47132), లింగంపల్లి – హైదరాబాద్ (47133), లింగంపల్లి – హైదరాబాద్ (47135), హైదరాబాద్ – లింగంపల్లి(47136), హైదరాబాద్ – లింగంపల్లి(47105), హైదరాబాద్ – లింగంపల్లి(47108), హైదరాబాద్ – లింగంపల్లి(47109), ఉమద్ నగర్ – లింగంపల్లి(47110), లింగంపల్లి – ఫలక్ నుమా(47112), లింగంపల్లి- ఉమద్ నగర్(47165), లింగంపల్లి – ఫలక్ నుమా(47189), ఫలక్ నుమా- లింగంపల్లి(47178), ఉమద్ నగర్ – లింగంపల్లి(47179), లింగంపల్లి – ఉమద్ నగర్ (47158), ఉమద్ నగర్ – లింగంపల్లి(47211), రామచంద్రాపురం – ఫలక్ నుమా(47212), ఫలక్ నుమా – లింగంపల్లి(47214), ఉమద్ నగర్ – లింగంపల్లి(47177), లింగంపల్లి- ఉమద్ నగర్(47181) సర్వీసులు ఉన్నాయి.

ప్రతీ రోజు నగర శివారు ప్రాంతాల నుంచి నగరంలోకి ఎంఎంటీస్‌ ద్వారా ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణాలు సాగిస్తుంటారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు ఎంఎంటీఎస్‌ను ఉపయోగించుకునే వారిలో మొదటి స్థానంలో ఉంటారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ దూరం ప్రయాణించే వీలు ఉండడంతో పెద్ద ఎత్తున ఈ సేవలు ఉపయోగించుంటారు. దీంతో ఈ సేవలను వారం రోజుల పాటు నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.