Natural Glowing Skin:ప్రస్తుత రోజులలో ఆడవారు, మగవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మెరిసే చర్మం కోసం అనేక టిప్స్ పాట్టిస్తూ వారి అందాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. అందం కోసం స్త్రీ పురుషులిద్దరూ పార్లర్లకు వెళ్లి నెలనెలా చాలా ఖర్చు కూడా చేస్తున్నారు. మార్కెట్‌లో అనేక రకాల ఫెయిర్‌నెస్ క్రీమ్‌లను మెరిసే చర్మం కోసం చాలామంది వాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఫెయిర్‌నెస్ క్రీమ్‌లను తయారీ కోసం అనేక రకాల హానికరమైన రసాయనాలు వాడుతురు. దీనితో మీ చర్మం రోజురోజుకు నిస్తేజంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. అందుకే గ్లోయింగ్ స్కిన్ కోసం ఎప్పుడూ నేచురల్ వస్తువులనే వాడాలని చాలా మంది అభిప్రాయం. అంతేకాకుండా మెరిసే చర్మం కోసం మనం పాలను కూడా ఉపయోగించవచ్చు. పాలలో విటమిన్ ఎ, డి, ఇ పుష్కలంగా లభిస్తాయి. కనుకనే వేసవిలో వడదెబ్బను కూడా తగ్గిచుకునేకి మంచిగా ఉపయోగపడుతుంది. పాలలో లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది సహజమైన స్కిన్ ఎక్స్‌ఫోలియంట్. ఇది మీ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది.
ఇక వర్షాకాలంలో కూడా మెరిసే చర్మం కావాలంటే పాలను వాడవచ్చు. వర్షాకాలంలో వచ్చే మొటిమలను పాలతో సులువుగా తొలగించుకోవచ్చు. దీంతో మచ్చలేని మెరిసే చర్మాన్ని మనం ఈజీ గా పొందవచ్చు. అయితే పాలతో మెరిసే చర్మం పొందడం ఎలాగో ఇప్పుడు చూద్దామా… మెరిసే చర్మం కోసం మనం నెలకు ఒకసారి పాల స్నానం కూడా చేయవచ్చు. ఇందుకు కోసం 3 కప్పుల పాలలో 10 – 15 పుదీనా ఆకులు, 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1/2 కప్పు, 1 కప్పు ఉప్పు, మొక్కజొన్న పిండిని ముందుగా కలుపుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో ఇవన్నీ బాగా కలుపుకొని ద్రవ మిశ్రమాన్ని మీ బాత్ టబ్‌లో పోసి కనీసం 20 నిమిషాల పాటు టబ్‌లో కూర్చోవాలి..
అలాగే మీరు సహజ పదార్ధాల సహాయంతో ఇంట్లోనే క్లెన్సింగ్ మిల్క్‌ని కూడా తయారు చేసుకోవచ్చు. దీనికోసం పాలలో తేనె, చిటికెడు పసుపు కలిపి క్లెన్సింగ్ మిల్క్‌ను తయారు చేసుకోవచ్చు. రోజు ఈ క్లెన్సింగ్ మిల్క్‌తో మీ ముఖాన్ని శుభ్రంగా కడుకోవాలి. అలాగే ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఈ క్లెన్సింగ్ మిల్క్‌తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ద్వారా మనం మన చర్మాన్ని మెరుగుపంచుకోవచ్చు. ఇక మరో విధానం ఏమిటంటే.. పచ్చి పాలను వాడడం ద్వారా మెరిసే చర్మం కోసం ఫేస్ ప్యాక్‌ని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పేస్ ప్యాక్ కోసం ముందుగా పచ్చి పాలలో శనగపిండి, ముల్తాని మిట్టి, పసుపు, తేనె కలిపి ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. ఇక ఈ ఫేస్ ప్యాక్‌ను ప్రతిరోజూ స్నానం చేసే ముందు అప్లై చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం.