Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

OnePlus Watch 2: ఫోన్ లాగా పని చేసే ఈ స్మార్ట్ వాచ్ గురించి మీకు తెలుసా..?

OnePlus Watch 2:

OnePlus Watch 2: ప్రస్తుతం ప్రతిఒక్కరు కూడా స్మార్ట్ వాచ్ ( smart watch)ల వినియోగం సర్వసాధారణం అయిపోయింది.. అందుకు ముఖ్య కారణం ఏంటంటే.. స్మార్ట్ వాచ్ లో అత్యాధునిక సాంకేతిక, హెల్త్ ట్రాకర్లు (health trackers) అలాగే ఫోన్ తో అనుసంధానించుకునే విధంగా ఉన్నందుకు యువత అందరూ దానికి ఆకర్షణ అవుతున్నారు. అందుకు తగ్గట్టు అనేక కంపెనీలు (company) కూడా అత్యాధునిక ఫ్యూచర్ లతో స్మార్ట్ వాచులను తయారు చేస్తున్నాయి కూడా. ఇకపోతే తాజాగా వన్ ప్లస్ నుండి వాచ్ 2 అనే పేరిట కొత్త వాచ్ ను విడుదల చేసింది. ఇందులో డ్యూయల్ చీప్ సెట్ (dueal chip set) స్మార్ట్ మోడ్ లో గరిష్టంగా 100 గంటల బ్యాటరీని అందజేస్తుంది.. అంతేకాకుండా వేర్ ఓఎస్ అందుబాటులో ఉండడం ఆకర్షనీయం. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు ఫ్యూచర్లు ఎలా ఉన్నాయి అంటే..


వన్ ప్లస్ స్మార్ట్ వాచ్ ను (one plus) వన్ ప్లస్ వాచ్ టు ( OnePlus Watch 2)అనే పేరిట మార్కెట్లోకి విడుదల చేసింది. ఇక ఇందులో ప్రత్యేకంగా డ్యూయల్ ఇంజన్ ఆర్కిటెక్చర్ ఉండడంతో పాటు బ్లూటూత్ కాలింగ్ (bluetooth calling) అవకాశం కూడా కలిగి ఉంది. అలాగే మ్యూజిక్ లవర్స్ కోసం మ్యూజిక్ (music) వినడానికి వాచ్ తో మీ బ్లూటూత్ ఇయర్ బర్డ్ లను కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా గూగుల్ మ్యాప్స్ గూగుల్ అసిస్టెంట్ వాలెట్ లాంటి మొదలగు యాప్స్ కూడా ఈ స్మార్ట్ వాచ్ లో పని చేస్తాయి. ఇక ఈ స్మార్ట్ వాచ్ ధర విషయానికి వస్తే.. 24,999 నుండి మొదలవుతుంది. ఇక ఈ వాచ్ డిజైన్ విషయానికి వస్తే.. చూడడానికి భారీగా కనిపిస్తుంది కానీ.. ఒకసారి వాచ్ ను ధరిస్తే చేతికే అందాన్ని కలగ చేయడంతో పాటు చాలా ఫ్యాషన్ గా కనబడుతుంది. ఇక ఈ వాచ్ 1.43 అంగుళాల రౌండ్ డిస్ప్లే తో క్రిస్టల్ కవర్ గ్లాస్ కలిగి ఉండడం విశేషం. అలాగే డిజిటల్ క్రాస్ చేసి నుండి కొత్తగా విస్తరించిన ఉన్న యాక్షన్ బట్టి కూడా ఉంది. ఇది విభిన్న రూపాన్ని అందించడంతోపాటు మరింత ఆకర్షణతంగా ఉంది. ఇక ఈ వాచ్ వాటర్ స్పోర్ట్స్ కోసం, పెద్ద బ్యాటరీ స్టైల్ ఫ్రేమ్ (style frame) ఉండడంతో ఇది కాస్త భారీగా కనపడవచ్చు.

ఇక వాచ్ పనితీరు విషయానికి వస్తే.. స్మార్ట్ వాచ్ 2000 చిప్స్ సెట్లతో వన్ ప్లస్ (oneplus)సొంతంగా అభివృద్ధి చేసిన డ్యూయల్ ఇంజన్ ఆర్కిటెక్చర్ ఆధారంగా పనిచేయడం ఆకర్షిణితం. స్నాప్‌ డ్రాగన్ (sanp dragon) బడ్ల్యూ 5 పనితీరు చిప్‌సెట్, బీఈఎస్ 2700 ఎంసీయూ ఎఫిషియెన్సీ చిప్‌సెట్ ఉంది. ఒక చిప్‌సెట్ బ్యాక్‌ గ్రౌండ్ యాక్టివిటీని, సింపుల్ టాస్క్‌ లను హ్యాండిల్ చేస్తే, మరొకటి శక్తివంతమైన టాస్క్‌ల కోసం యాక్టివ్‌ గా మారుతుందని వన్ ప్లస్ అధికారులు తెలిపారు. ఈ స్మార్ట్ వాచ్లో సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ ఇచ్చే 7.5వాట్ల వీఓఓసీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో (fast charging) 500ఎంఏహెచ్ బ్యాటరీని 60 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ఫుల్ చార్జ్
కూడా చేస్తుంది. ఒక్కసారి స్మార్ట్ వాచ్ ను ఛార్జెయింగ్ చేస్తే 100 గంటలు నిరంతరాయంగా పని చేస్తుంది. ఇక ఒకవేళ అధికంగా యాప్స్ వినియోగిస్తూ ఉంటే 48 గంటల పాటు పని చేయవచ్చు.